తిన్నాకే వ్యాయామం

‘ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలి’... అనే నియమం అంత మంచిది కాదు. ఏమీ తినకుండా ఎక్స్‌ర్‌సైజ్‌...

Published : 27 Jan 2018 01:24 IST

ఫిట్‌-మంత్ర
తిన్నాకే వ్యాయామం

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే మంచిదా?

- షఫి, కడప  

‘ఖాళీ కడుపుతో వ్యాయామం చేయాలి’... అనే నియమం అంత మంచిది కాదు. ఏమీ తినకుండా ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తే హార్మోన్లు, కండర కణజాలాలపై ప్రభావం ఉంటుంది. అంతేగాకుండా గ్లూకోజ్‌ స్థాయి తగ్గి శరీరం నీరసపడే ప్రమాదం లేకపోలేదు. వ్యాయామానికి అరగంట ముందే తక్కువ మోతాదులో పోషకాహారం తీసుకోవడం శ్రేయస్కరం. పాలు, అరటిపండు, డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటే మంచిది. ఉడకబెట్టిన ఆలు ఒకటి, ఒక చిన్న కప్పులో లోఫ్యాట్‌ పెరుగు తీసుకున్నా ఫలితం ఉంటుంది. ఒక కప్పు  పండ్ల ముక్కలు, ఉడకబెట్టిన కూరగాయలు, గుడ్లు తిన్నా ప్రయోజనం. ఇవి మనకు తక్షణ శక్తినిస్తాయి. పైగా వీటిలోని పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కండరాల వృద్ధికి దోహదపడతాయి. ఎక్కువ పిండి పదార్థాలున్న ఆహారం తీసుకోవద్దు. ఇవి అరగడానికి చాలా సమయం పడుతుంది. అప్పుడు వ్యాయామం చేయడం కష్టం. పైగా ఆ సమయంలో మెదడు చురుగ్గా పనిచేయదు. దీనివల్ల ఎక్స్‌ర్‌సైజు చేయాలన్నా ఆసక్తి తగ్గిపోతుంది.

-చిక్కా శ్రీనివాస్‌, ట్రైనర్‌, ఫిట్‌నెస్‌-9   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని