చీర కట్టే చిన్నోడు

జీన్స్‌ వేస్తారు. షార్ట్స్‌ వేస్తారు. ధోతీ కూడా కడతారు. కుర్రాళ్లకు ఏది నచ్చితే అదే ట్రెండ్‌. కానీ ఎక్కడైనా ఓ అబ్బాయి చీర కట్టడం చూశారా? అదీ ఇంటా, బయటా ప్రతిరోజూ. హిమాంశువర్మ మాత్రం...

Published : 09 Jul 2016 01:27 IST

సమ్‌థింగ్‌ స్పెషల్‌
చీర కట్టే చిన్నోడు

జీన్స్‌ వేస్తారు. షార్ట్స్‌ వేస్తారు. ధోతీ కూడా కడతారు. కుర్రాళ్లకు ఏది నచ్చితే అదే ట్రెండ్‌. కానీ ఎక్కడైనా ఓ అబ్బాయి చీర కట్టడం చూశారా? అదీ ఇంటా, బయటా ప్రతిరోజూ. హిమాంశువర్మ మాత్రం అలాగే చేస్తాడు. పైపెచ్చు మీరూ కట్టుకోండి అని సలహా కూడా ఇస్తాడు. చోద్యం.. విచిత్రం.. వింత.. పేరేదైనా పెట్టుకోండిగాక! మీ ఇష్టం. అందుకే అతగాడికి ‘శారీమ్యాన్‌’గా పేరొచ్చింది.

ఇరవై ఏళ్ల వయసున్నపుడు ఓసారి ఎందుకో అమ్మ చీర ధరించాలనే ఆలోచన పుట్టింది హిమాంశ్‌కి. అది మొదలు పన్నెండేళ్ల నుంచి చీరకట్టు వదల్లేదు. ఇప్పుడు అతడి వార్డ్‌రోబ్‌లో చీరలు తప్ప మరేం లేవు. మొదట్లో చాలామంది చాలారకాలుగా, చులకనగా మాట్లాడారు. అవేం పట్టించుకోలేదు. అతగాడికి రాన్రాను చీరలంటే ఎంత ఇష్టం పెరిగిపోయిందంటే ఐదేళ్లనుంచి ప్రతి ఏడాది శారీ ఫెస్టివల్‌ నిర్వహిస్తున్నాడు. నూటాయాభై ఏళ్ల కిందట ఠాగోర్‌ వంశస్థుల్లో ఆడా, మగా ఇద్దరూ చీరలు కట్టేవారనీ రాన్రాను ఇది కనుమరుగైపోయిందని ఎంతో పరిశోధన చేసి మరీ చారిత్రక సత్యాలను కనుగొన్నాడు. చీర కడతాడు కదాని హిమాంశ్‌ తేడానా అంటే ఒప్పుకోడు. నేను నిఖార్సైన మగాడినేనంటాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని