కార్యాలయం... కసరత్తుల కార్యక్షేత్రం!

వీలైతే అరగంట నడక... కుదిరితే కాసేపు వ్యాయామం... ఒంటికి మంచిదని ఎన్ని అధ్యయనాలు చెబితే ఏం లాభం? చాలామంది యువోద్యోగులకు ఇలా చేయడానికి ఏమాత్రం తీరిక

Published : 23 Jul 2016 01:51 IST

కార్యాలయం... కసరత్తుల కార్యక్షేత్రం!

వీలైతే అరగంట నడక... కుదిరితే కాసేపు వ్యాయామం... ఒంటికి మంచిదని ఎన్ని అధ్యయనాలు చెబితే ఏం లాభం? చాలామంది యువోద్యోగులకు ఇలా చేయడానికి ఏమాత్రం తీరిక లేదాయే! మరెలా? ఉద్యోగ కార్యాలయంలోనే చేయగలిగే చిన్నపాటి వ్యాయామాలు ఉన్నాయి. తక్కువ స్థలంలో సైతం ఈ కసరత్తులు చేస్తే చురుకుదనం, ఉత్సాహం మీ వెంటే. ప్రయత్నించండి...

పైకప్పును తట్టండి


అద్నన్‌ సమీ ‘ముఝ్‌ కో భీ లిఫ్ట్‌ కరాదే’ స్టెప్పు గుర్తుందిగా! పైకప్పు చూపించేలా చేతిలో కాస్త బరువులు పెట్టుకొని భుజాలు తాకేలా ఓ ఇరవైసార్లు కిందికీ, పైకీ అంటే సరి.


ఒకటి తర్వాత ఇంకోటి

ఒక మోకాలిని మడిచి పైకీ, కిందికి ఆడిస్తూ అదే సమయంలో చేతులతోనూ ఆ ప్రక్రియ కొనసాగించాలి. పదిసార్లు అలా చేశాక రెండో మోకాలును ఉపయోగించాలి.


మోకాలి మడతలు

చిత్రంలో చూపినట్టు ముందు ఒక మోకాలును మడిచి రెండు చేతులనూ కిందికీ, పైకీ ఆడించాలి. పదిసార్లు చేశాక మెకాలిని యథాస్థానంలోకి తెచ్చి రెండో మోకాలిని మడిచి మళ్లీ చేతులకు పనిచెప్పాలి.


పక్షిలా ఆడిస్తూ

ఫొటోలోచూపినట్టు శరీరాన్ని ఒక కుర్చీకి ఆనించి, మోకాళ్లను కొద్దిగా మడిచి పక్షి రెక్కల్లా చేతుల్ని వెనక్కి, ముందుకి ఆడించాలి.


బాహు బంధనాలు

శరీరాన్ని 45 డిగ్రీల కోణంలో ముందుకు వంచి శరీర భారాన్ని పిరుదులపై పడేలా చూడాలి. ఆపై రెండు చేతుల్ని వెనక్కి, ముందుకు ఆడించాలి.


ప్రార్థన భంగిమ

ఎదుటివాళ్లను హత్తుకునేలా ముందు రెండు చేతుల్ని విశాలంగా చాచి ఆహ్వానిస్తున్నట్టుగా పోజు పెట్టాలి. మెడ, నడుములను కిందికి వంచుతూ, పైకి లేస్తూ ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని