అండర్‌కట్‌ టాట్టూ.అదిరేట్టు

ఒంటిపై టాట్టూలు వేసుకోవడం పాత పద్ధతి. కురులతో ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఉన్నదే....

Published : 13 Aug 2016 01:26 IST

అండర్‌కట్‌ టాట్టూ.అదిరేట్టు

ఒంటిపై టాట్టూలు వేసుకోవడం పాత పద్ధతి. కురులతో ప్రయోగాలు చేయడం ఎప్పుడూ ఉన్నదే. ఈ రెండింటికీ లంకె పెట్టి ‘అండర్‌కట్‌ టాట్టూ’ ట్రెండ్‌కి తెర తీశారు ఆధునిక అమ్మాయిలు. ఒంటిపై సూదులు గుచ్చుకోకుండానే అందరిలో ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఈ స్టైల్‌ అందుకున్నారు. మెడ వంపుల భాగంలో జుత్తును రకరకాల డిజైన్లలో కత్తిరించి వగలు పోతున్నారు. వాటిని ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల్లో పెట్టేస్తున్నారు. పశ్చిమంలో పుట్టిన సొగసు మనదాకా చేరింది.

ట్రెండ్‌కి ఆద్యులు: మిలీ సైరస్‌, రిహాన్నా, క్రిస్టెన్‌ స్టివార్ట్‌, హల్లెబెరీ..

ఎవరికి అనుకూలం?: పొట్టి జుత్తు ఉన్నవారికి

బాగా ఆదరిస్తున్నవారు: మోడళ్లు, సినీతారలు, అడ్వర్టైజింగ్‌ ఉద్యోగులు, కాలేజీ కుర్రకారు

పాపులరైన నగరాలు: దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌లో అక్కడక్కడా

ఈ స్టైల్‌కి అయ్యే ఖర్చు: డిజైన్‌ని బట్టి రూ.500 నుంచి రూ.2000



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని