Published : 25 Dec 2016 16:34 IST

హైహై నాయకా

హైహై నాయకా

చండశాసనుడు.. దెయ్యం.. పని రాక్షసుడు.. బాస్‌పై చెప్పుకున్నోళ్లకు చెప్పుకున్నంత. కానీ పై అధికారి మరీ చెడ్డోడేం కాదంటోంది ‘మాన్‌స్టర్‌’ అధ్యయనం. నయా బాస్‌లు ఉద్యోగికి అనుకూలంగానే ఉంటారట. ఇదిగో ఇలా!

‘ఆర్డర్ల మీద ఆర్డర్లేసి చంపేస్తున్నాడ్రా బాబూ.. పనితో చచ్చేది మేం’ ఇలా బాస్‌ని తిట్టుకోని వాళ్లు అరుదే. కానీ ఒక్క పనికి పురమాయించడమే కాదు.. ఉద్యోగులు ఏవైనా తప్పులు చేస్తే అవి పైస్థాయికి వెళ్లకుండా కవర్‌ చేసే బాస్‌లు 90 శాతం ఉన్నారట.

వారాంతాల్లో సరదాగా సెలవులు గడిపాక సోమవారం పని బద్ధకంతో అమ్మమ్మ పోయిందనో.. అర్జెంటు పని ఉందనో అడ్డంగా అబద్ధాలాడేసి ఆఫీసుకు ఎగనామం పెట్టేవాళ్లు ఎంతోమంది. వీటిని పసిగట్టినా ‘పోనీలే...’ అని లైట్‌ తీసుకునేవాళ్లే ఎక్కువట.

పనిలో బద్ధకస్తుడైనా ఉద్యోగి మంచివాడైతే సమయానికి ప్రమోషన్ల నిచ్చెన ఎక్కిస్తూ కనికరం చూపే బాస్‌ల సంఖ్య సగానికి ఎక్కువే.

మీపై మీకు నమ్మకం లేకపోయినా బాస్‌కి మీపై గురి ఎక్కువ. అందుకే కీలకమైన పనులు అప్పజెపుతూ ఉద్యోగి శక్తిసామర్థ్యాలను వెలికితీస్తుంటారు.

పని బాగా చేసే ఉద్యోగుల పట్ల బాస్‌లు ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారు. కుదిరితే.. హోదా, కేడర్‌ పక్కనపెట్టి ప్రేమ, పెళ్లి రాయబారాలు నడిపే వారూ పెరుగుతున్నారంటోంది సర్వే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు