చోరీ చేసేది మనోళ్లే!

మన ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారనే అనుమానం.. మన ప్రమేయం లేకుండానే పోస్ట్‌లు, ఫొటోలు మన వాల్‌ మీద ప్రత్యక్షమవడం.. మనం పంపకుండానే ఇతరులకు వీడియోలు వెళ్లిపోవడం..

Published : 28 Jan 2017 01:10 IST

చోరీ చేసేది మనోళ్లే!

న ఫేస్‌బుక్‌ ఖాతాను ఎవరో హ్యాక్‌ చేశారనే అనుమానం.. మన ప్రమేయం లేకుండానే పోస్ట్‌లు, ఫొటోలు మన వాల్‌ మీద ప్రత్యక్షమవడం.. మనం పంపకుండానే ఇతరులకు వీడియోలు వెళ్లిపోవడం.. ఇలాంటి అనుభవం ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. ఎవరు చేశారనేది ఎంతకీ అంతుబట్టదు. అయితే ఇలా మన ఖాతా హ్యాకింగ్‌కి, సమాచార చోరీకి గురయ్యే ఐదు సందర్భాల్లోని ఒకదానిలో కచ్చితంగా మనకు తెలిసినవారే అయ్యింటారంటున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటీష్‌ కొలంబియా పరిశోధకులు. అందులోనూ దగ్గరి స్నేహితులు, సహోద్యోగులు, ప్రేమికులకే మన వ్యక్తిగత సమాచారం తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువట. దొంగచాటుగా మన ఖాతా వివరాలు రాబట్టి మన అనుమతి లేకుండానే ఖాతాలోని వ్యక్తిగత సమాచారం చూస్తారంటున్నారు ఈ పరిశోధకుల్లో ఒకరైన వలీ అహ్మద్‌ ఉస్మానీ. మామూలు రోజుల్లో ఇది సరదాగానే ఉన్నా ప్రేమికులు బ్రేకప్‌ చెప్పినపుడు, స్నేహితులు విడిపోయినపుడు అవే వివరాలతో మనని ఇబ్బందులు పాలు చేసే అవకాశాలు ఎక్కువంటున్నారు. 1,308 మంది ఖాతాదారుల అనుభవాల ఆధారంగా ఈ అధ్యయనాన్ని లెక్కగట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని