పడితినంటా... ప్యార్‌లోనా!

దువ్విన తలనే దువ్వడం.. అద్దం విడవకపోవడం.. అన్నం తినాలనిపించకపోవడం.. ఏంటివన్నీ? ప్రేమలో పడ్డ కుర్రకారుకు సోకే లక్షణాలు. అయితే ఇదంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నాటి .....

Published : 11 Feb 2017 01:17 IST

పడితినంటా... ప్యార్‌లోనా!

దువ్విన తలనే దువ్వడం.. అద్దం విడవకపోవడం.. అన్నం తినాలనిపించకపోవడం.. ఏంటివన్నీ? ప్రేమలో పడ్డ కుర్రకారుకు సోకే లక్షణాలు. అయితే ఇదంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నాటి ముచ్చట బాస్‌. ఇప్పటి యూత్‌ లక్షణాలన్నీ వేరేగా ఉంటాయ్‌. ఎలాగంటే...

రింగ్‌టోన్లు.. వాల్‌పేపర్లు: హనీ, బంగారం, బుజ్జీ, మై హార్ట్‌... ప్రేమికుడు/ప్రియురాలి పేరుని ఇలా ముద్దుపేర్లతో సేవ్‌ చేసుకుంటారు. వారి నెంబర్‌కి ప్రత్యేకమైన రింగ్‌టోన్లు పెట్టేసుకుంటారు. ఫోన్‌ వాల్‌పేపరూ వాళ్లదే.

పాస్‌వర్డ్‌లు: ఆమె/అతడే జీవితం అనుకున్నపుడు దాపరికాలెందుకు? అందుకే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, జీమెయిల్‌.. బ్యాంకు ఖాతా.. ప్రతి పాస్‌వర్డ్‌ పంచుకుంటారు.

సినిమాలు, పార్టీలు: అభిమాన హీరో సినిమా విడుదలైనరోజు మొదటిరోజే చూసేయాలన్నంత ఆతృత ఉంటుంది. అయినా మనసుకి నచ్చినవారి కోసం వాయిదా వేస్తుంటారు. పార్టీలు, ఫంక్షన్లు, ప్రయాణాలకూ ఇదే సూత్రం.

క్విజ్‌లు: వ్యక్తిత్వం, ప్రేమ, జీవనశైలి క్విజ్‌లంటే తెగ మక్కువ చూపిస్తారు. వాటిని ఆసక్తిగా పూరించి ఫలితాల్ని ప్రేమికులతో పంచుకుంటారు.

యాప్స్‌ హాంఫట్‌: అప్పటిదాకా స్మార్ట్‌ఫోన్‌ తెరపై డజన్లకొద్దీ డేటింగ్‌ యాప్‌లుంటాయి. ఒక్కసారిగా వాటిపై మోజు తగ్గి, అసహ్యం వేసి వాటన్నింటినీ తొలగిస్తారు.

కుటుంబసభ్యులకీ హాయ్‌: ప్రేమించిన అమ్మాయి/అబ్బాయితోనే కాదు... వారి కుటుంబసభ్యులకూ గేలం వేస్తారు. వాళ్లతో పరిచయం పెంచుకోవడానికి దగ్గరవడానికి సామాజిక మాధ్యమాలు, ఇతర మర్గాల ద్వారా ప్రయత్నిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని