దిల్లుంటే దునియా మెచ్చేస్తుంది

‘అరేయార్‌.. వాడి వ్యక్తిత్వం మంచిదిరా’ అనిపించుకున్నోడికి దునియానే సలాం కొడుతుంది. చదువు.. కెరీర్‌ ఎక్కడైనా దూసుకెళ్లొచ్చు.

Published : 25 Mar 2017 01:22 IST

దిల్లుంటే దునియా మెచ్చేస్తుంది

‘అరేయార్‌.. వాడి వ్యక్తిత్వం మంచిదిరా’ అనిపించుకున్నోడికి దునియానే సలాం కొడుతుంది. చదువు.. కెరీర్‌ ఎక్కడైనా దూసుకెళ్లొచ్చు. మంచి వ్యక్తిత్వం కేజీకి ఇంతని ఎక్కడా దొరకదు. మన నడవడికే దాన్ని నిర్ణయిస్తుంది. ఇదిగో ఇలా.

* వినండి: ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వినేవాళ్లు ఎక్కువ పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు. ఇలా వింటూ ఉంటే ప్రవర్తన, ఆలోచన, నడవడిక... ఎన్నో కిటుకులు పట్టేయొచ్చు. చెప్పేవాళ్లకీ మరింత ఉత్సాహం.

* కొత్త ఆసక్తి: జిమ్‌కెళ్లడం.. పాటలు నేర్చుకోవడం.. మరో కొత్త అలవాటు.. మనిషిలో కొత్త కోణాన్ని బయటపెడతాయి. మెదడుని తాజాగా ఉంచుతాయి. మనలాంటి ఆసక్తి ఉన్నవాళ్లని దగ్గరికి చేర్చుతాయి.

* మాట్లాడ్డం: నలుగురిలో కలిసినపుడు.. చొరవగా పలకరించినపుడు అంతా దగ్గరవుతారు. ఇది ఆత్మవిశ్వాసం పెంచుతుంది. అయితే మాట్లాడ్డానికి ముందే విషయంపై తగిన కసరత్తు చేయాలి. లేదంటే నవ్వులపాలవుతాం.

* గౌరవం, మర్యాద: మనం ఇతరుల నుంచి ఏం కోరుకుంటామో.. వారూ అదే ఆశిస్తారు. హోదా, స్థాయి, వయసు.. కాకుండా ప్రతి ఒక్కరికీ గౌరవం ఇవ్వండి. మనం మంచిని పంచితే మంచి మన పంచన చేరుతుంది.

* నాయకుడు: నాయకత్వ లక్షణాలతో వ్యక్తిత్వానికి పరిపూర్ణత దక్కుతుంది. అయితే కష్టాలను భరించగలగడం... బాధ్యతలకు ముందుండటం నాయకుడి లక్షణాలని గుర్తించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని