ఆల్బమ్‌ కోసం కత్తిగాట్లు

పాట కోసం తపించే సింగర్లని చూశాం. దక్షిణకొరియా మ్యూజిక్‌.....

Published : 15 Apr 2017 01:28 IST

ఆల్బమ్‌ కోసం కత్తిగాట్లు

పాట కోసం తపించే సింగర్లని చూశాం. దక్షిణకొరియా మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘సిక్స్‌ బాంబ్‌’ సభ్యులు ఏకంగా కత్తిగాట్లకే సిద్ధమయ్యారు. తమ పాట, ఆట, అందంతో.. కే-పాప్‌లో ప్రపంచంలో పాపులర్‌ అయిన ఈ నలుగురూ ఇప్పటికి ఐదు ఆల్బమ్స్‌ పాడారు. ‘బికమింగ్‌ ప్రెట్టీ’ అనే ఆల్బమ్‌ అయితే గంగ్నమ్‌ స్టైల్‌లా అక్కడ పెద్ద హిట్‌. ‘మేం అందంగా పాడతామని తెలుసు.. దానికి తగ్గట్టే అందంగా మారాలనుకోవడంలో తప్పులేదుగా. అందుకే ప్లాస్టిక్‌ సర్జరీలకు వెళ్తున్నాం’ అని ప్రకటించింది బృందంలోని లీడ్‌ సింగర్‌ డైన్‌. గుండ్రని కళ్లు.. విశాలమైన ముఖం.. తీరైన నాసిక.. భారీ వక్ష సంపద కోసం ఈ శస్త్రచికిత్సల కోసం వెళ్తున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని