ఫ్రెండ్. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్.. ఇదో ట్రెండ్!
ఫ్రెండ్. హాఫ్ గర్ల్‌ఫ్రెండ్.. ఇదో ట్రెండ్!
హాఫ్ గర్ల్‌ఫ్రెండ్... ఈమధ్య కుర్రకారు నోళ్లలో తెగ నానుతున్న పదం. మనకు ఫ్రెండ్ తెలుసు. బోయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండూ తెలుసు. మధ్యలో ఈ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ఏంటి? మూడున్నరేళ్ల కిందట చేతన్‌భగత్ ఇదే పేరుతో నవల రాశాడు. అదే టైటిల్‌తో తాజాగా వచ్చిన బాలీవుడ్ సినిమా కుర్రకారులో గిలిగింతలు పెడుతోంది. పలకరింపు కాస్త వింతగా ఉన్నా ఈ భావన యువతీయువకుల మధ్య ఎప్పట్నుంచో ఉందంటారు సామాజిక నిపుణులు. ఆ విచిత్ర అనుబంధంపై ఓ లుక్కేద్దాం.పరిచయస్తులు ‘హాయ్’ అంటే ‘హాయ్’ అంటాం. స్నేహితులైతే మనసు విప్పి మాట్లాడుకుంటాం. ప్రేమికులైతే అన్నీ పంచుకుంటారు. మరి హాఫ్ గర్ల్‌ఫ్రెండ్, హాఫ్ బోయ్‌ఫ్రెండ్‌కి నిర్వచనం ఏంటి? అంటే ఫ్రెండ్‌కి ఎక్కువ, లవర్‌కి తక్కువ అని ఒక్క మాటలో తేల్చేయొచ్చు.
సినిమాలో హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన శ్రద్ధాకపూర్ ఓ ప్రచార కార్యక్రమంలో ‘ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడు కొత్తేం కాదు. నాకు ఫలానా అబ్బాయి అంటే చాలా ఇష్టం కానీ అతడికి పూర్తిగా కమిట్ కాలేదని నా స్నేహితురాళ్లు ఎంతోమంది నాతో చెప్పారు’ అంటూ ఈ భావన గతంలో ఉన్నదే అని చెప్పేసింది. ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. సినిమాలు, షికార్లకి కలిసే వెళతారు. ప్రేమ, చదువు, అనుంబంధం, సెక్స్... ప్రపంచంలో ఏ టాపిక్ అయినా అరమరికల్లేకుండా మాట్లాడేసుకుంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. ఎవరికేదైనా అయితే తల్లడిల్లిపోతారు. అప్పుడప్పుడు ఇద్దరి మధ్య రొమాన్స్ కూడా నడుస్తుంది. అయినా వాళ్లు స్నేహితులా? ప్రేమికులా, ఆత్మీయులా... ఏదీ తేల్చుకోలేని ఒక అనిశ్చితిలో ఉంటారు. సామాజిక అనుబంధాల వెబ్‌సైట్లలో రిలేషన్‌షిప్ స్టేటస్ ‘సింగిల్’గానే చూపిస్తుంది. ఈ అనుబంధంలో ముఖ్యంగా అబ్బాయి అమ్మాయి మీద ఉన్న ప్రేమను ఎప్పుడో ఓసారి తప్పకుండా వ్యక్తం చేస్తాడు. తను ఆమెని హా సుందరిగా అభివర్ణించుకుంటాడు. అమ్మాయి మాత్రం మనసులో మాట బయట పెట్టడానికి వెనుకంజ వేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ అనుబంధం ఎవరికీ అర్థం కాని భావోద్వేగం. స్నేహితులు, ప్రేమికుల్లాగే సమస్యలు, గందరగోళం, అపార్థాలు వీరి మధ్య కూడా ఉంటాయి. ప్రేమకు ఉన్న సూత్రాలే ఈ అనుబంధానికీ వర్తిస్తాయి. అందుకే పట్టణాలు, నగరాల్లో ఈ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ ధోరణిని కుర్రకారు ఫుల్‌గా అంగీకరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు
-
Politics News
Andhra News: ఉదయగిరికి వచ్చా.. దమ్ముంటే తరిమికొట్టండి: ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సవాల్