తేలిగ్గా వ్యాయామం... తీరైన ఫలితం!

పెద్దగా బరువులెత్తే పన్లేదు... జిమ్‌కెళ్లే అవసరమే లేదు... ఇల్లు.. ఆఫీసు.. దేన్నైనా కసరత్తుల కేంద్రంగా మలిచేయొచ్చు... తీరైన శరీరాకృతికి... శరీరంలోని ప్రతి కండరానికీ పూర్తి వ్యాయామం... ఒళ్లు, కండరాల నొప్పులున్నవారికీ ఉపశమనం... కుర్రకారు ఎక్కువగా ఫాలో అవుతున్న రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌తో ఇవన్నీ సాధ్యమే... ఆచరించే టిప్స్‌ ఇవిగో.

Published : 15 Jul 2017 01:52 IST

తేలిగ్గా వ్యాయామం... తీరైన ఫలితం!

పెద్దగా బరువులెత్తే పన్లేదు... జిమ్‌కెళ్లే అవసరమే లేదు... ఇల్లు.. ఆఫీసు.. దేన్నైనా కసరత్తుల కేంద్రంగా మలిచేయొచ్చు... తీరైన శరీరాకృతికి... శరీరంలోని ప్రతి కండరానికీ పూర్తి వ్యాయామం... ఒళ్లు, కండరాల నొప్పులున్నవారికీ ఉపశమనం... కుర్రకారు ఎక్కువగా ఫాలో అవుతున్న రెసిస్టెన్స్‌ బ్యాండ్స్‌తో ఇవన్నీ సాధ్యమే... ఆచరించే టిప్స్‌ ఇవిగో.

రెసిస్టెంట్‌ బ్యాండ్‌ చేతిలో ఇమిడిపోయే వ్యాయామ సాధనం. సాగే గుణం ఉండటం దీని లక్షణం. ఇందులోనూ చేత్తో పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే హ్యాండిల్‌ బ్యాండ్స్‌, లూప్‌ బ్యాండ్స్‌, థెరపీ బ్యాండ్స్‌ ఉంటాయి. శరీరాకృతికి అనుగుణంగా నప్పేవి ఎంచుకోవాలి. ఈ బ్యాండ్‌ని కాలి కింద అదిమిపెట్టి చేతులతో హ్యాండిల్‌ పట్టుకొని బలాన్నంతా ఉపయోగిస్తూ ఐదు నుంచి ఇరవైసార్లు వరకు కిందికిపైకి, వెనక్కిముందుకి రెప్స్‌ చేస్తుండాలి. మెడ, భుజం, మోకాలు, వెన్ను... ఇతర ఏ నొప్పి ఉన్నా ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ మంచి వర్కవుట్‌ అంటారు ఫిట్‌నెస్‌ ట్రైనర్లు.

ఎవరికి నచ్చినట్టు వారు..

భుజాలు, మెడ, వీపు, తొడలు, మోకాళ్లు... ఇలా శరీరంలోని ప్రతి భాగం, కండరాలపై ప్రభావం చూపేలా ఈ వ్యాయామం చేయొచ్చు. అందులో కొన్ని ముఖ్యమైనవి.
క్రాస్‌ బెంట్‌ ఓవర్‌ రో: మోకాళ్లను కిందికి వంచి వెన్నెముకను నిటారుగా ఉంచాలి. వంగేటపుడు రెసిస్టెన్స్‌ ట్యూబ్‌ని పైకి లాగుతూ వదలాలి. ఇలా చేస్తే వెన్నెముక కండరాలు గట్టి పడతాయి.
షోల్డర్‌ ప్రెస్‌: ఒక కాలుని వెనక్కి పెట్టి రెండో కాలు మోకాలిని వంచాలి. ఇలా చేస్తున్నపుడు మెకాలికి సమాంతరంగా ఉండాలి. తర్వాత ట్యూబ్‌ని పైకి లాగాలి. ఇలా చేస్తే భుజం కండరాలకు చక్కని వ్యాయామం.
బైసెప్‌ కర్ల్‌: ట్యూబ్‌ని కాలి కింద అదిమిపెట్టి చేతుల్ని మడిచి మళ్లీ నిటారుగా తీసుకురావాలి. ఇలాగైతే చేతి కండలు గట్టి పడతాయి.
సైడ్‌ ల్యాటరల్‌ రెయిజ్‌: ఈ వ్యాయామంతో మెడ, భుజాల్లోని త్రిభుజాకారపు కండరాలు గట్టి పడతాయి.

ప్రయోజనాలు...

* ఎలాంటి బరువులు ఎత్తకుండానే కఠిన కసరత్తులు చేస్తే వచ్చే ప్రయోజనాల్ని రెసిస్టెన్స్‌ బాండ్స్‌తో పొందగలం.
* ఇది ఫుల్‌ బాడీ వర్కవుట్‌. స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌ వ్యాయామం. కొద్దిపాటి శిక్షణతో సొంతంగా కసరత్తులు చేయొచ్చు.
* బరువు ఉండవు, పెద్దగా స్థలం అక్కర్లేదు. బ్యాండ్స్‌ని ఎక్కడికైనా తేలికగా... వెంట తీసుకెళ్లవచ్చు.
* ధర కూడా తక్కువే. రూ.300లతో మొదలుపెట్టి రూ.2వేల వరకు ఉంటాయి. కోర్‌ కండరాల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫిగర్‌ 8 రెసిస్టెన్స్‌ ట్యూబ్‌లు కాస్త ఖరీదెక్కువ.
* మన స్థాయి, శక్తిని బట్టి లైట్‌, మీడియం, హెవీ అని సాగే గుణం, మందం ఎక్కువ తక్కువలు ఉన్నవి ఎంచుకోవచ్చు.

స్మార్ట్‌గా...

రెసిస్టెన్స్‌ వ్యాయామాన్ని సైతం స్మార్ట్‌గా చేసేందుకుLiftUp అనే స్మార్ట్‌ బ్యాండ్‌ వచ్చేసింది. యాప్‌ సాయంతో దీన్ని మన సెల్‌ఫోన్‌తో అనుసంధానించొచ్చు. వ్యాయామం ఎలా చేయాలో సూచనలిస్తుంది. ఎంత సమయం ఎఫెక్టివ్‌గా చేశామో, ఎన్ని కేలరీలు కరిగాయో చెబుతుంది. ధర.రూ.6500

- బాబీ, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని