షర్ట్‌లెస్ హీరోలొచ్చారు
షర్ట్‌లెస్ హీరోలొచ్చారు
సినిమాలో పాటలుంటాయ్. ఫైట్లూ ఉంటాయ్. ఇదెంత నిజమో.. హీరో అన్నాక ఎప్పటికైనా చొక్కా విప్పేయాన్నదీ అంతే నిజం. సిక్స్, ఎయిట్ ప్యాక్‌ల బాడీ చూపించాలంటే అది తప్పదుగా. బాలీవుడ్‌కైతే ఆ నిబంధన మరింత తప్పనిసరి. కింగ్‌ఖాన్ షారూఖ్ నుంచి నిన్నటి మొన్నటి కుర్రహీరో దాకా అంతా ఆ ట్రెండు ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ జాబితాలో సుశాంత్‌సింగ్‌రాజ్‌పుత్ గతంలోనే చేరిపోతే.. తాజాగా రాజ్‌కుమార్‌రావు అడుగుపెట్టాడు. సుశాంత్ ‘షర్ట్‌లెస్ స్టార్’గా పేరు కొట్టేస్తే... ఆర్ట్ సినిమా హీరో అనిపించుకున్న రాజ్‌కుమార్ కొత్త రూపంతో ఔరా అనిపిస్తున్నాడు.
మొదట్నుంచీ హీరో అనిపించుకోవాలనే బలమైన కోరిక ఉన్న సుశాంత్ సిక్స్‌ప్యాక్‌తోనే పరిశ్రమకి వచ్చేశాడు. ‘పీకే’లో మెరిసింది కాసేపే కావడంతో కండలు ప్రదర్శనకు అవకాశం రాలేదు. తర్వాత ‘ఎంఎస్ ధోనీ’తో మొదటిసారి కండరగండడు అనిపించుకున్నాడు. ఇక ‘రాబ్తా’లో ఒంటి మీద చొక్కా నిలిస్తే ఒట్టు. ముఖ్యంగా ‘మై తేరా బోయ్‌ఫ్రెండ్...’ పాటలో అతగాడి ఎయిట్‌ప్యాక్ కండల్ని చూసి అమ్మాయిలు ఫిదా అయిపోయారు. ఈ సినిమాకు ముందు, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా స్టార్ ఫొటోగ్రాఫర్ మరియో టస్టినో తీసిన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫొటోలు అంతర్జాలంలో సంచలనం సృష్టించాయి. దానికి ముందు చొక్కా విప్పేసి నృత్య సాధన చేస్తున్న వీడియో సైతం అభిమానుల్ని అలరించింది. ఏ చిన్న అవకాశం దొరికినా చొక్కా విప్పి హడావుడి చేస్తుండటంతో ఈ యువ హీరోని షర్ట్‌లెస్ స్టార్‌ని చేసేశాయి.
రాజ్‌కుమార్‌రావు అంటే బాలీవుడ్‌లో మంచి నటుడిగా, సంసార పక్షమైన పాత్రలకు సరిపోతాడని పేరుంది. అది నిన్నటి సంగతి. తాజాగా రాజ్ కూడా కండల వీరులా జాబితాలో చేరిపోయాడు. లవర్‌బోయ్‌గా నటించిన సినిమా ‘బెహెన్ హోగీ తేరీ’ కోసం సిక్స్‌ప్యాక్‌తో బాడీని తీర్చిదిద్దాడు. విక్రమాదిత్య మోత్వానీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ట్రాప్డ్’లో బక్కపల్చగా కనిపిస్తే, సుభాష్‌చంద్రబోస్ కోసం బాన పొట్ట పెంచాడు. కొద్దికాలంలోనే మూడు రూపాలు చొక్కా విప్పేసి చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఆన్‌లైన్‌లో వార్తల్లో వ్యక్తయ్యాడు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
AI Chatbot: వాతావరణ మార్పులపై ఏఐ చాట్‌బాట్ రిజల్ట్.. ఆందోళనతో వ్యక్తి ఆత్మహత్య!
-
Politics News
Karnataka polls: ఎన్నికల వేళ జేడీఎస్‌కు షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా!
-
Movies News
SIR: ‘సార్’ని అలా చూపించుంటే ఇంకా బాగుండేది: పరుచూరి గోపాలకృష్ణ
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Zelensky: ‘బుచా’ హత్యాకాండకు ఏడాది.. దోషులను ఎప్పటికీ క్షమించం!
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక