స్టైల్‌స్టైల్‌గా కొలువు కొడదామా

మంచి మార్కులు, భావ వ్యక్తీకరణ కొలువు కొట్టడంలో కీలకమే. దాంతోపాటే ఈ ఆధునిక

Published : 22 Jul 2017 01:37 IST

స్టైల్‌స్టైల్‌గా కొలువు కొడదామా

మంచి మార్కులు, భావ వ్యక్తీకరణ కొలువు కొట్టడంలో కీలకమే. దాంతోపాటే ఈ ఆధునిక యుగంలో కాస్త స్టైల్‌గానూ కనపడాలి. ఇది ఉద్యోగార్థులకు ప్లస్‌పాయింట్‌ అన్నది నిపుణుల మాట. వారి సూచనలు.

* ముదురు నలుపు లేదా నేవీ బ్లూ సూటు ఎలాంటి శరీరాకృతి ఉన్నవారికైనా బాగా నప్పుతాయి. మరీ వదులుగా, మరీ బిగుతుగా ఉండకుండా సరిపోయేట్టు ఉండాలి.

* సన్నని ప్రింట్లు ఉన్న టై ధరించండి. బూట్లకి తగ్గట్టే టై రంగు ఎంచుకోవాలి.

* అమ్మాయిలకైతే ప్యాంటుసూట్లు, పెన్సిల్‌ స్కర్టులు బాగా నప్పుతాయి. హుందాగా కనిపిస్తాయి. సంప్రదాయ దుస్తులైతే హుందాగా, పరిణతి చెందిన మహిళల్లా కనిపిస్తారు.

* వస్త్రధారణ కేవలం అందంగా కనిపించడానికే కాదు. ఇంటర్వ్యూలో అభ్యర్థి ఆత్మవిశ్వాసం పెరగడానికీ, వ్యక్తిత్వాన్ని చూపించడానికీ ఇదో సాధనం. మనం బాగా ఫీలవ్వాలన్నా మంచి దుస్తులు తొడగాలనే విషయం మర్చిపోవద్దు.

* ముడతలు పడ్డ దుస్తులు, మురికి పాదరక్షలు ఇంటర్వ్యూ చేసేవాళ్లలో మనపై చులకన భావం కలగజేస్తాయి. దుస్తులు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఇస్త్రీ చేసినవై ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని