సెల్ఫీకి సాహసాలొద్దు!

కుర్రకారు సెల్ఫీలతో ఎందుకు చెలరేగిపోతారు? ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో గోడకి వేలాడదీయడానికి....

Published : 19 Aug 2017 01:00 IST

సెల్ఫీకి సాహసాలొద్దు!

కుర్రకారు సెల్ఫీలతో ఎందుకు చెలరేగిపోతారు? ఫ్రేమ్‌ కట్టించి ఇంట్లో గోడకి వేలాడదీయడానికి మాత్రం కాదు గురూ. ఫేస్‌బుక్‌ వాల్‌పై ప్రదర్శించడానికి.. వాట్సాప్‌లో షేర్‌ చేసి ‘వాహ్‌’ అనిపించుకోవడానికి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేసి తారలా పోజు కొట్టడానికి.. ఎవరి కారణం వారిది. అంత ప్రాముఖ్యం ఉన్న స్వీయచిత్రం అందరు మెచ్చేలా పేలిపోవాలంటే ఇవిగోండి చిట్కాలు.
* సెల్ఫీ బాగా రావాలంటే లొకేషన్‌ ముఖ్యం. అలాగని బుర్జ్‌ ఖలీఫా ఎక్కి క్లిక్‌మనిపించాల్సిన పన్లేదు. అనవసర సాహసాలూ వద్దు. బ్యాగ్రౌండ్‌ బాగుండేలా చూసుకుంటే చాలు. బాత్రూమ్‌లు, టాయ్‌లెట్లు, మార్కెట్లు.. ఇలాంటిచోట్ల సెల్ఫీలు అసలొద్దు.
* దిగాలు మొహాలు.. నిట్టూర్పుల భావాలు ఎవరికీ నచ్చవు. సెల్ఫీకి ముందు మన మొహం జోష్‌ యంత్రంలా కళకళలాడాలి. సరదా హావభావాలతో, చూస్తేనే నవ్వు పుట్టించేలా ఉత్సాహం కనపడాలి. అప్పుడే నలుగురి దృష్టిలో పడతాం.
* పోజుల్లోనూ కొత్తదనం ఉండాలి. అవసరమైతే కాస్త వింతగా కనిపించాలి. ఇంట్లోని పెంపుడు జంతువులతో కలిసి ఫొటోలు దిగడం. చిత్ర, విచిత్ర హావభావాలతో ఆకట్టుకోవడం.. ఇలా.
* సమయం, సందర్భం, పోజులే కాదు.. సెల్ఫీల్లో సాంకేతిక విషయాలూ ముఖ్యమే. మొహాలపై సూర్యకిరణాలు, నీడ పడటం.. తక్కువ లైటింగ్‌.. సెల్ఫీని తేలిపోయేలా చేస్తాయి.
* కనిపించీ కనిపించకుండా, చూపించీ చూపించకుండా.. మొహం కొద్దిగా కనిపించేలా ఏవైనా అడ్డుపెట్టడం.. అరచేతుల్లో దాచుకోవడం.. పెట్స్‌ని మొహానికి అడ్డంగా ఉంచడం ఆసక్తి రేకెత్తిస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని