జజ్జనకరి జనారే ఫిట్‌నెస్ నీదేరే!
జజ్జనకరి జనారే
ఫిట్‌నెస్ నీదేరే!
సల్సాలు.. జుంబాలు బోర్ కొట్టేశాయి...
బాలీఫిట్‌లు.. యోగా డాన్స్‌లు పాతబడిపోయాయి...
కొత్తదనం కోరుకునే ఫిట్‌నెస్ జంకీలు ఉసూరుమంటుంటే..
వాళ్లకి హుషారు తెప్పించడానికి వచ్చేసింది ఫోక్ ఫిట్‌నెస్...
విదేశాల నుంచి అరువుతెచ్చుకునే ధోరణికి భిన్నంగా ఈ ట్రెండ్ అచ్చంగా భారత్‌లోనే పురుడు పోసుకుంది...
జానపద నృత్యరీతులకు.. ఫిట్‌నెస్ స్టెప్పులు జోడించి రూపొందించిన ఫోక్ ఫిట్‌నెస్‌తో ఉత్తర భారతం వూగిపోతోంది... తెలుగు రాష్ట్రాల్లోనూ వూపు మొదలైన ఈ నయా ట్రెండ్ విశేషాలివి....
ఆరోగ్యంగా ఉండాలని, ఫిట్‌నెస్‌పై పట్టు సాధించాలని కోరుకోని కుర్రకారుండరుగా! జాగింగ్‌లు, వాకింగ్‌లు చేస్తూ యథాశక్తి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరైతే జిమ్‌కెళ్లి కఠిన కసరత్తులు చేసి కండరగండడు అనిపించుకోవాలనుకుంటారు. కాకపోతే ఏకాంతంగా కసరత్తులు చేస్తూ ఒంట్లోని కేలరీలు కరిగిస్తూ ఉంటుంటే కొన్నాళ్లకి ఎవరికైనా బోర్‌గా ఉంటుంది. ఆ అనాసక్తికి చెక్ పెట్టేందుకు, సరికొత్త జోష్ నింపడానికి మొదలైనవే డ్యాన్స్ ఫిట్‌నెస్ ట్రెండ్‌లు. సల్సా, జుంబా, బాలీఫిట్.. ఆ వరుసలోవే. వీటికి ఇంకాస్త భిన్నంగా వచ్చిందే ఫోక్ ఫిట్‌నెస్.
మొదలైందిలా...
కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ అనగానే సహజంగానే అందరి చూపూ పాశ్చాత్య దేశాలవైపు ఉంటుంది. ఫోక్ ఫిట్‌నెస్ మాత్రం అచ్చంగా మనదే. పుణె అమ్మాయి ఆర్తి పాండే రూపకర్త. తనో ఫిట్‌నెస్ జంకీ, శిక్షకురాలు. తనదగ్గర శిక్షణ పొందేవారు కొన్నాళ్లకే వ్యాయామంపై అనాసక్తి చూపించడం, అర్థాంతరంగా క్లాసులు మానేయడం.. భారీ కసరత్తులు కష్టంగా భావించడం గమనించింది. దీనికి పరిష్కారంగా ఓ కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ రూపొందించాలనుకుంది. తనకి భారతీయ జానపద నృత్యాలంటే తగని మమకారం. వాటిల్లోంచి కొత్త ఫిట్‌నెస్ ఫామ్ కోసం ప్రయత్నాలు చేసింది. ఏడాదిపాటు శ్రమించి దేశంలోని 130 జానపద నృత్యరీతులపై పరిశోధనలు చేసి.. వాటిని సమ్మిళితం చేసి ఫోక్ ఫిట్‌నెస్ వ్యాయామంగా రూపొందించింది. వీటికి ఎప్పటికప్పుడు మార్పులు చేసేలా.. మరుగున పడిపోతున్న ఇతర జానపద నృత్యాల్ని వెలికితీసి కొత్తకొత్త ఫిట్‌నెస్ రీతులు కంపోజ్ చేసేలా తన దగ్గర ఓ బృందమే పనిచేస్తోంది. పుణెలో మొదలైన ఈ ధోరణి దిల్లీ, నాగపుర్, అహ్మదాబాద్, కోల్‌కతాల్లో బాగా పాపులరై హైదరాబాద్, వైజాగ్ నగరాలనూ చుట్టేసింది.
లాభాలేంటి?
పుషప్‌లు, స్వాట్స్, డంబెల్స్, కార్డియో వర్కవుట్లు... ఇలా శరీరంలోని ఒక్కో భాగం కోసం ఒక్కోరకం వ్యాయామం చేయాలి. ఫోక్ ఫిట్‌నెస్ మాత్రం ఫుల్ బాడీ వర్కవుట్‌లా పనిచేస్తుంది. ఉదాహరణకు మహారాష్ట్ర కోలీ జానపద నృత్యం చేపలు పట్టే జానపదుల డాన్స్. అందులో చేపలు పడుతున్నట్టు చేతుల్ని వూపుతూ, కాళ్లని ఆడిస్తారు. ఇది అప్పర్ బాడీ వర్కవుట్. రాజస్థానీ చిర్మీ లోయర్ బాడీ వర్కవుట్‌లా.. గుజరాబీ గార్బా కార్డియో కసరత్తులా.. పంజాబీ భాంగ్రా టోటల్ బాడీ వర్కవుట్‌లా పని చేస్తుంది. సంగీతం, నృత్యానికి అనుగుణంగా మనసూ, తనువూ వూగిపోతుంటే శ్రమ తెలియకుండానే వందల స్వాట్లు, పులప్‌లు, పుషప్‌లు పూర్తవుతాయి. నలభై నిమిషాల వ్యాయామంతో ఒంట్లోని 900 కేలరీలు కరిగిపోతాయి. సాధారణంగా ఈ ఫోక్‌ఫిట్‌నెస్ సెషన్ నలభై అయిదు నిమిషాల నుంచి గంట వరకుంటుంది. ముందు పదినిమిషాలు ధ్యానం, ఆపై మరో పదినిమిషాలు చేతులు, కాళ్లు వూపుతూ వార్మప్‌లుంటాయి. తర్వాత శరీరం కిందిభాగంపై ప్రభావం చూపే కసరత్తులు మొదవుతాయి. తర్వాత క్రమంగా పైకి వెళ్తారు. చివరగా కార్డియో కసరత్తులతో ముగుస్తుంది. ఒక నెల పాటు ఫోక్‌ఫిట్‌నెస్ చేస్తే రెండు నుంచి ఐదు కిలోల బరువు తగ్గుతారంటారు శిక్షకురాలు ప్రేమలత. కసరత్తులు మరీ కఠినంగా లేకపోవడం..ఫాస్ట్‌బీట్.. జానపదం కలగలిపి హుషారునిచ్చే అంశాలు ఉండటంతో ఈ ఫిట్‌నెస్ ట్రెండ్ యువతకి తెగ నచ్చేస్తోంది. వారానికి మూణ్నాలుగు తరగతులుండే ఈ కోర్సుకి ఫీజు రూ.3 వేల నుంచి మొదలవుతుంది.
జానపద నృత్యం- శరీర భాగానికి వ్యాయామం
* రథ్వా (మధ్యప్రదేశ్)- వెన్నెముక, వెన్నెముక కిందిభాగం
* చాపేలి (ఉత్తరాఖండ్)- ఛాతీ, భుజాలు, పక్కటెముకలు, నడుము భాగం
* చిర్మీ (రాజస్థాన్)- దృఢమైన కండరాలు, వీపు
* ఘంటూ (సిక్కిం)- మణికట్టు, వీపు కిందిభాగం, నడుము, తొడలు
* దేఖ్‌నీ (గోవా)- తొడలు వెనకభాగం, వీపు కిందిభాగం
* లంబాడీ (ఆంధ్రా/తెలంగాణ)- కాలి పిక్కలు, తొడలు
* కోలీ (మహారాష్ట్ర)- భుజాలు, వెన్నెముక, భుజ కండరాలు
* కాల్బెలియా (రాజస్థాన్)- చేతులు, కాలి పిక్కలు, వెన్నెముక, తొడలు
* గార్భా- మణికట్టు, భుజాలు, వీపు కిందిభాగం, నడుముభాగం
* కర్కాట్టం (తమిళనాడు) - చేతులు, తొడలు, మోకాళ్లు, భుజాలు
* కశ్మీరీ (కశ్మీర్)- తొడలు, మణికట్టు, భుజాలు, నడుము కిందిభాగం
* భాంగ్రా (పంజాబీ): తొడ కండరాలు,
అచ్చంగా భారతీయం
- ప్రేమలత, ఫోక్ ఫిట్‌నెస్ శిక్షకురాలు
|
ఇప్పుడిప్పుడే మొదలు
- బాబీ, వ్యాయామ శిక్షకుడు
|
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?
-
Politics News
Harish Rao: ఇదేనా భాజపా చెబుతోన్న అమృత్కాల్?: హరీశ్‌రావు ఫైర్
-
Movies News
Social Look: వాణీకపూర్ ‘క్రైమ్ థ్రిల్లర్’.. చీరలో శోభిత హొయలు!
-
Politics News
BS Yediyurappa: సిద్ధూపై యడ్డీ తనయుడి పోటీ..?
-
World News
United Airlines: ఖరీదైన విస్కీ బాటిల్లో మద్యం చోరీ..కంగుతిన్న విమాన ప్రయాణికుడు