అతిలోక సుందరికి తీసిపోరు!
స్టైల్ గురూ!
అతిలోక సుందరికి తీసిపోరు!
మనీశ్ మల్హోత్రా.. బాలీవుడ్ మెచ్చిన స్టార్ డిజైనర్. మరి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లెవరు? నిన్నటిదాకా అతిలోకసుందరి శ్రీదేవి పుత్రికలు. ఇప్పుడైతే ఆ ట్యాగ్ చెరిపేసుకొని బాలీవుడ్‌లో స్టైల్ ఐకాన్‌లుగా మారిపోయిన అక్కాచెల్లెళ్లు. ప్రైవేటు పార్టీ.. సినిమా ఫంక్షన్.. అవార్డుల వేడుక.. సందర్భం ఏదైనా సరికొత్త స్టైల్‌తో చెలరేగిపోతున్నారీ సహోదరీమణులు. మొన్న శ్రీదేవి 55వ పుట్టినరోజు.. అంతకుముందు ఐఫా వేడుక.. నిన్న అంబానీ ఇంట్లో జరిగిన పార్టీ.. తాజాగా ముంబయి విమానాశ్రయంలో మెరవడం.. అకేషన్ సొగసులతో కనికట్టు చేస్తూ అందరి కళ్లూ తమపైనే పడేలా చేస్తున్నారు. గతవారం ఓ అపర కుబేరుడు బాలీవుడ్ అతిథుల కోసం ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు. అక్కడా ఈ ఇద్దరే సెంటరాఫ్ అట్రాక్షన్. బంగారువర్ణంతో మెరిసిపోయే ఆఫ్‌షోల్డర్ షిమ్మరీ డ్రెస్‌తో జాన్వీ కనువిందు చేస్తే.. కలర్‌ఫుల్‌గా ఉన్న మొషీనో బ్రాండ్ టాప్, స్కర్ట్‌తో ఖుషీ ఆకట్టుకుంది. అసలు సంగతి ఏంటంటే టాప్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా జాన్వీ డ్రెస్‌ని డిజైన్ చేయడం. ముంబయి విమానాశ్రయంలో స్పోర్టీ లుక్‌లో ట్రెండీగా కనిపించి ‘వహ్వా’ అనిపించారు. జాన్వీ బ్రైట్ రెడ్‌కలర్ లోయర్‌పై సిల్వర్ నిలువు చారలు, కంప్లీట్ వైట్ స్కిన్ టైట్ టీషర్టు ధరిస్తే.. ఖుషీ ఇదే లుక్‌లో బ్లాక్ కలర్ స్కిన్‌టైట్‌లోయర్, వైట్ టీషర్టు.. అదే రంగులో జర్కిన్... హీల్ షూ వేసి అక్కకి పోటీగా నిలిచింది. ఈ ఔట్‌ఫిట్స్‌కి జతగా జాన్వీ తెల్లని షూ, బికినీ హ్యాండ్‌బ్యాగు పట్టుకొని... జుట్టు మొత్తం లూజ్‌గా వదిలేసి ట్రెండీగా కనిపించింది. గతంలో కరీనాకపూర్, కరిష్మాకపూర్‌లు ‘సిబ్లింగ్ స్టైల్స్’కి పర్యాయపదంగా నిలిస్తే ఇప్పుడు ఈ ఇద్దరూ మేమున్నామంటూ వచ్చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
అలా మాట్లాడితే.. కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేస్తా: సీఎం హిమంత హెచ్చరిక
-
General News
AP High court: అధికారుల వైఖరి దురదృష్టకరం.. వారిని జైలుకు పంపాలి: హైకోర్టు
-
Movies News
IPL 2023: ఐపీఎల్ వేడుకల్లో రష్మిక, తమన్నా హంగామా.. ‘నాటు’ స్టెప్పులు అదుర్స్ అనాల్సిందే!
-
World News
Heartbreaking Story: మా అమ్మ కన్నీటితో డైరీలో అక్షరాలు తడిసిపోయాయి..!
-
World News
ఎయిర్‌పోర్ట్‌లో లగేజ్ మాయం..ఎయిర్టాగ్తో నిందితుడిని గుర్తించిన ప్రయాణికుడు
-
Movies News
Jagapathi Babu: అడవిని తలపించే ఇల్లు.. జగపతి బాబు తల్లి జీవన విధానమిది