బ్రిట్నీ ‘వన్‌ మోర్‌ టైం’ కొత్తగా...

‘బేబీ వన్‌ మోర్‌ టైం’.. పాప్‌సింగర్‌ బ్రిట్నీ స్పియర్‌ని రాత్రికి రాత్రే స్టార్‌ని చేసిన పాట. మత్తెక్కించే గొంతుతో.. సెక్సీ డ్యాన్స్‌తో 1998లో వచ్చిన ఆ పాప్‌సాంగ్‌ యువతను ఓ ఊపు ఊపేసింది.

Published : 18 Nov 2017 01:54 IST

బ్రిట్నీ ‘వన్‌ మోర్‌ టైం’ కొత్తగా...

‘బేబీ వన్‌ మోర్‌ టైం’.. పాప్‌సింగర్‌ బ్రిట్నీ స్పియర్‌ని రాత్రికి రాత్రే స్టార్‌ని చేసిన పాట. మత్తెక్కించే గొంతుతో.. సెక్సీ డ్యాన్స్‌తో 1998లో వచ్చిన ఆ పాప్‌సాంగ్‌ యువతను ఓ ఊపు ఊపేసింది. ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి వెరైటీగా గుర్తు తెచ్చుకుంది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్‌ షో పెట్టబోతున్నానోచ్‌’ అంటూ అభిమానుల్ని ముందే ఊరించింది. ఆపై సర్‌ప్రైజ్‌ చేస్తూ చిన్నపాటి ఫొటోషూట్‌ పెట్టేసింది. పాల నురగల బెల్‌ స్లీవ్‌ టాప్‌.. నలుపు రంగు మినీ స్కర్ట్‌.. కాళ్లకి ప్లెయిడ్‌ అండ్‌ మినీ బూట్స్‌తో అచ్చంగా బేబీ వన్‌ మోర్‌ టైం సాంగ్‌లో వేసుకున్న డిజైన్‌ దుస్తుల్ని దించేసింది. సినిమాలు, సాంగ్స్‌ రీమేక్‌ చేసినట్టు.. ఇది రీమేక్‌ ఫ్యాషన్‌ ట్రెండ్‌ అంటున్నారు అభిమానులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని