Published : 23 Dec 2017 01:59 IST

కాల‘మ్యాన్‌’ని-2018

‘మగా’రవిందం
కాల‘మ్యాన్‌’ని-2018

కుర్రకారుని అలరించే అమ్మాయిల ఫొటోలతో వచ్చే కింగ్‌ఫిషర్‌ కేలండర్ల గురించి అందరికీ తెలుసు! మరి అబ్బాయిలతో ఫొటోషూట్‌ చేసి ఏటా ఓ కేలండర్‌ విడుదల చేస్తున్నారు. దీని గురించి మీకు తెలుసా? ఫ్యాషన్‌షో డైరెక్టర్‌ సునీల్‌ మెనన్‌ ఈ కేలండర్‌ రూపకర్త. హెచ్‌ఐవీ బాధితులను ఆదుకొనేందుకు అవసరమైన నిధుల సేకరణ కోసం 2010 నుంచి ఈ కేలండర్‌ రూపొందిస్తున్నారు. 2018 సంవత్సరం కేలండర్‌ను ఇటీవలే విడుదల చేశారు. దేశవ్యాప్తంగా పరిశీలించి 13 మంది మంచి బాడీబిల్డర్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ప్రకృతి రమణీయమైన ప్రాంతాల్లో ఫొటో షూట్‌ చేశారు. వివిధ రకాల పూల మధ్య ఈ 13 మంది తమ శరీర సౌష్టవాన్ని ప్రదర్శిస్తున్న ఫొటోలతో ఈ కేలండర్‌ కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. జర్బెరా, ఆల్‌మండ్‌, రోజ్‌, ట్యూబ్‌రోజ్‌, మారీగోల్డ్‌, ఎంథురియమ్‌... వంటి పుష్పాలు ఆ మోడల్స్‌ కండలని మరింత అందంగా చూపుతున్నాయి. ఈ మోడల్స్‌లో త్రిశూర్‌కు చెందిన నహస్‌ ఓ ఆటోడ్రైవర్‌ కావడం విశేషం. ఇలాంటి కొత్త వారి ప్రతిభను వెలికితీయడానికి నా కేలండర్‌ షూట్‌ ఉపయోగపడుతుందని సునీల్‌మెనన్‌ ఒకింత గర్వంగా చెబుతుంటారు.