నీ జీన్స్‌కు నువ్వే డిజైనర్‌

రిప్‌డ్‌ జీన్స్‌ ఇప్పుడు ఎంత ఫ్యాషనో అది ధరించిన యువత మోమే చెబుతుంది. మరి అలాంటి రిప్‌డ్‌ జీన్స్‌ను...

Published : 20 Jan 2018 02:21 IST

నీ జీన్స్‌కు నువ్వే డిజైనర్‌ 

రిప్‌డ్‌ జీన్స్‌ ఇప్పుడు ఎంత ఫ్యాషనో అది ధరించిన యువత మోమే చెబుతుంది. మరి అలాంటి రిప్‌డ్‌ జీన్స్‌ను మీరే సొంతంగా తయారుచేసుకోవచ్చు. మీకు కావాల్సింది చాక్‌పీస్‌, కొలబద్ద, కత్తెర, పట్టకర, జీన్స్‌ అంతే. కొంచెం సృజనాత్మకతతో ఆలోచించి పనిచేస్తే మీ పాత జీన్స్‌ను కూడా ట్రెండీగా మార్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం... మీ జీన్స్‌కు మీరే డిజైనర్‌...

బ్రిజిల్స్‌ జీన్‌  

జీన్స్‌ కింది అంచు నుంచి 2 అంగుళాల పైకి చాక్‌పీస్‌తో మార్క్‌ చేయండి. కత్తెరతో నిలువునా చిన్న చిన్న పోగుల్లా కత్తిరించండి. మధ్యలో నిలువునా వేలాడుతున్న తెల్లటి దారాలను కొన్నింటిని అక్కడక్కడ పట్టకరతో లాగేయండి. ఈ జీన్స్‌ వేసి నడుస్తుంటే బ్రిజిల్స్‌ (పోగులు) గాలికి మడమలపైన కదులుతుంటే మీ నుంచి ఎవరూ కళ్లు తిప్పుకోలేరు. 

ఆఫ్‌కట్‌ 

జీన్స్‌ కింది అంచు నుంచి 2.5 ఇంచుల పైకి మార్క్‌ చేయండి. జీన్స్‌ లెగ్స్‌కు కుట్టు ఉంటుంది కదా... అక్కడ నుంచి ముందు భాగాన్ని కత్తిరించి తీసివేయండి. అప్పుడు ఇదిగో ఈ చిత్రంలోలా మన జీన్స్‌ ట్రెండీగా మారుతుంది. 

ట్రైయాంగిల్‌ కట్‌

బూట్‌కట్‌ జీన్స్‌ తీసుకోవాలి. కింది అంచు నుంచి 8 అంగుళాలు కొలిచి మార్క్‌ చేసుకోండి. కింది వైపు కొంచెం వెడల్పుగా... పైకి వెళ్లే కొద్ది త్రిభుజాకృతిలో జీన్స్‌ను కత్తిరించండి. వాటి అంచులను కొద్దిగా పోగుల్లా కత్తిరించుకుంటే మీ ఫ్యాషన్‌కి ఫిదా అవ్వని వారుండరు. అబ్బాయిలు, అమ్మాయిలకిద్దరికీ ఈ ఒరవడి నప్పుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని