మెట్టింట్లోకి రావాలంటే నెట్టిల్లొద్దు!

భార్యాభర్తలు చెరో మూలన కూర్చుని సెల్‌ఫోన్‌లతో సహవాసం చేస్తే.. సంసారం అంతే సంగతులు. అందుకేనేమో ...

Published : 27 Jan 2018 01:21 IST

మెట్టింట్లోకి రావాలంటే నెట్టిల్లొద్దు!

భార్యాభర్తలు చెరో మూలన కూర్చుని సెల్‌ఫోన్‌లతో సహవాసం చేస్తే.. సంసారం అంతే సంగతులు. అందుకేనేమో పశ్చిమబంగలోని ఓ ఇంటి తల్లిదండ్రులు ముందుచూపుతో ఓ పెళ్లి ప్రకటన ఇచ్చారు. సాధారణ పెళ్లి ప్రకటనల్లో అయితే ‘వధువు అందంగా ఉండాలి. ఉద్యోగం చేస్తుండాలి’ అనంటారు. అయితే పశ్చిమ బంగలో వచ్చిన ఆ పెళ్లి ప్రకటనలో మాత్రం ‘మా అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి. తనకు కాబోయే భార్య వయసు 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్‌ అయితే చాలు. అయితే.. ఆ అమ్మాయి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు అతుక్కుపోకూడదు సుమా’ అని ఉంది. చూశారా భవిష్యత్తులో వధువు మెట్టింట్లోకి వెళ్లాలన్నా.. వరుడు అత్తారింట్లో అడుగుపెట్టాలన్నా.. సోషల్‌మీడియాతో బ్రేకప్‌ చేసుకోవాలేమో!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని