పాతటైర్లతో ఫటాఫట్‌!

కథానాయకులు.. కండలవీరులు.. పాతటైర్లను ఎత్తే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. లేదంటే వ్యాయామశాలల్లో టైర్లతో వ్యాయామం చేసే వాళ్లూ కనిపిస్తుంటారు.....

Published : 03 Feb 2018 01:37 IST

 ఫిట్‌నెస్‌ మంత్ర
పాతటైర్లతో ఫటాఫట్‌!

కథానాయకులు.. కండలవీరులు.. పాతటైర్లను ఎత్తే సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తుంటాం. లేదంటే వ్యాయామశాలల్లో టైర్లతో వ్యాయామం చేసే వాళ్లూ కనిపిస్తుంటారు. చూసేవాళ్లకు ఇదంతా స్టయిల్‌ కోసం చేస్తున్నట్లే అనిపిస్తుంది. కేవలం టైర్లే కదా.. ఎవరైనా ఎత్తిపడేయొచ్చు అనుకుంటాం. అయితే ఈ పాతటైర్లతో వ్యాయామం చక్కటి ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు ఫిట్‌నెస్‌ నిపుణులు. టైర్లతో ఇరవై నిమిషాలు వర్కవుట్‌లు చేస్తే కచ్చితంగా నాలుగువందల క్యాలరీలు ఖర్చు అవుతాయట. అయితే కండరాల్లో పటుత్వం ఉన్నవాళ్లే టైర్లతో ఎక్సర్‌సైజ్‌లు చేయాలన్నది నిపుణుల సూచన. దీని కోసం ముందుగా కారు టైర్లను మాత్రమే ఎంచుకోవాలి. వాటితో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాక.. ట్రాక్టర్‌, లారీ టైర్లను వాడొచ్చు. నిపుణుల పర్యవేక్షణలోనే టైర్లతో ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. లేదంటే గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. ఒకవైపు నుంచి టైర్లను ఎత్తడం, దొర్లించడం, తాడుతోకట్టి లాగడం.. వంటివన్నీ చేయొచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ క్యాలరీలను కరిగించే శక్తి వీటికుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని