Published : 07 Apr 2018 01:14 IST

రైల్వేలో సెల్ఫీ జోన్లు

రైల్వేలో సెల్ఫీ జోన్లు

ట్టాలపై పడుకొని, రైలు వేగంగా వస్తుంటే దాని ముందు నిలబడి సెల్ఫీలు దిగే యువకులు ఇటీవల ఎక్కువైపోయారు. వీరి ప్రాణాలు కాపాడేందుకు రైల్వే శాఖ వినూత్న యత్నం మొదలుపెడుతోంది.
2014 నుంచి 2016 వరకూ లెక్కలు పరిశీలిస్తే... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సెల్ఫీలు తీసుకొనే వారే 60 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న భారత రైల్వే సెల్ఫీ జోన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశోక్‌ లొహాని ఇందుకు తగిన ఆదేశాలిచ్చేశారు. డిసెంబరు 2018 కల్లా దేశవ్యాప్తంగా తొలివిడతలో 70 సెల్ఫీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఉదయ్‌పూర్‌, జైపూర్‌, బికనిర్‌, జోధ్‌పూర్‌, గాంధీనగర్‌లలో సెల్ఫీ జోన్లు యువతకు ఆహ్వానం పలుకుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని