శిల నువ్వే ఉలి నువ్వే
శిల నువ్వే ఉలి నువ్వే
మిలీనియల్ మంత్రా
ఒకప్పుడు హాలిడేస్ అంటే...‘ఎంజాయ్ మామ!’ అనుకునేవారు...ఇప్పుడు ట్రెండ్ మారింది...ఎంజాయ్‌తో పాటు ‘ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం డూడ్’ అనుకుంటున్నారు. చెక్‌లిస్ట్‌ని పెట్టుకుని సెలవుల్లో హల్‌చల్‌కి సిద్ధం అవ్వాలనుకుంటున్నారు నేటి తరం. తమలో దాగున్న శిల్పాన్ని వెలికి తీసేందుకు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అనుభవాల సారం అనుకున్నా... ఆలోచనల్లో వైరుధ్యం అనుకున్నా... మిలీనియల్స్ మార్పు మంచిదేగా..! మరి, మీరూ ఇదే జాబితాలోకి వస్తారా?
* నీతో నువ్వు కాసేపు |
అద్దం ముందు నిల్చున్నాడు ఆర్యన్. ఈరోజు కాలేజ్ రీ-ఓపెన్. హా.....వ్‌లింతలు ఇంకా ఆగలేదు. కళ్లు ఎర్రగా మారాయి. ఆ ఎరుపుల కింద నల్లటి చారలు! హ్యాంగోవర్? ఒకట్రెండు రోజుల హ్యాంగోవర్ కాదు...! ఓ నలభై రోజుల హ్యాంగోవర్! ఉదయం 10 తర్వాత లేవడం.. తాపీగా టిఫిన్ తినడం.. ఎంటర్‌టైన్మెంట్ కోసం యూట్యూబ్... మ్యాచ్‌ల కోసం హాట్‌స్టార్... సెల్ఫీ స్టేటస్‌లు... సాయంత్రం వీలైతే ఫస్ట్ షో.. లేకుంటే హ్యాంగ్‌అవుట్స్..! రోజుమార్చి రోజు సెకెండ్ షో.. కాకుంటే నైట్ పార్టీ! ఇదే వరస కాకపోవచ్చు! కానీ అటూఇటూగా ఇంతే! కానీ, ఆర్యన్ అండ్ కో మరీ అంత చెడ్డవాళ్లేం కాదు! రెండు వారాల కిందటి ఫ్లాష్‌బ్యాక్... రింగులు రింగులుగా... గ్రూపు ముచ్చట్లు ఇలా ఉన్నాయి.. ‘ఛ.. సెలవులంత వేస్ట్ అయ్యాయిరా మామా..! వచ్చే ఏడాది ‘గేట్’కి ఎలా ప్రిపేర్ అవుతాం?! రేపణ్నుంచి చదివేయాల్రా..! కానీ ఏం చేద్దాం! ప్చ్... ఈ ఐపీఎల్ మ్యాచ్‌లు ఒకటి. ధోని ఏం కొట్టాడు రా మామ.రేయ్ రేపు మ్యాచ్ ఎక్కడ చూద్దాం. తర్వాత ట్రీట్ ఎక్కడ?...’ ఇలాగే రోజులు గడిచిపోయాయి! మ్యాచ్‌లు... లేట్ నైట్ షోలు.. రోజుల తరబడి గీయని గడ్డం. మాసిన జుట్టు.. ఇవన్నీ ఏదోలా అడ్జెస్ట్ చేయొచ్చు. కానీ.. అడ్డూఅదుపులేకుండా పెరిగిన బొజ్జని ఎలా దాచడం...? ఇదీ ఆర్యన్‌కి పెద్ద సమస్యే! అబ్బాయిలే కాదు. అమ్మాయిల మస్తీ అంతా... ఇంతా కాదు. అయితే, కాయిన్‌కి రెండో వైపు అన్నట్టుగా...
*అదే రోజు.. అదే సమయం..
అద్దం ముందు ప్రణయ. ‘స్మార్టీ’... కాలేజీలో తన నిక్‌నేమ్ అది!
చదువులో తనకి ఎదురు లేదు. క్విజ్‌లో.. మ్యాథ్స్.. అంశం ఏదైనా స్మార్ట్‌గా సమాధానాలు వచ్చేస్తాయ్... అయితే, ఒక్కటే లోపం... చెప్పలేనంత భయం. గట్టిగా మాట్లాడాలన్నా.. అబ్బాయిల్ని చూసినా.. భయం..భయం! కానీ, సెలవుల తర్వాత తను వేరు. కళ్లలో ఆత్మవిశ్వాసం. ‘రాక్ క్లైంబింగ్’కి వెళ్లి ట్రోఫీతో తిరిగొచ్చింది!
‘పరమ పిరికి..’ ముద్రపడ్డ తను పరాక్రమశాలి అనిపించుకుంది.
ఇప్పుడు తన వ్యక్తిత్వానికి.. నిర్భీతి ఓ భవంతి! సాధన.. దానికి పునాది!
అనుపమ అద్దంలో తనని తాను చూసుకుంది. ఒంగిపోయి నడిచే తను.. నేడు నిటారు మెరుపులా తయారైంది. ఆ మెరుపు శరీరంలోనే కాదు.. మనసులోనూ!
...అవును ప్రణయ మాదిరిగా ఈ వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తూనే లోపాల్ని సరి చేసుకోవచ్చు. కొద్దిగా అదుపు.. మరికొద్ది ఒడుపు ఉంటే ఆటవిడుపులో అద్భుతాలు చేయొచ్చు. కావాల్సిందల్లా... మనల్ని మనం తరచిచూడటం! చేయాల్సిందల్లా... సంకల్పం ఉలితో ఓ శిల్పిలా మనల్ని మనం చెక్కుకోవడం! ‘అబ్బా.. సెలవుల్లోనూ ఎందుకివన్నీ?’ అనుకుంటున్నారా? ఒక్కసారి మీ లోపాల్ని చూసి నవ్విన వాళ్లని గుర్తుతెచ్చుకోండి. ముఖం చిట్లించిన వారిని మననం చేసుకోండి. కోపమొస్తోంది గదా..! ఆ అవమానాలతో పోలిస్తే ఇవి చాలా చిన్న విషయాలు కదా! ట్రై చేయండి. మలచుకోండిలా..!
* రాసుకో సిద్ధా రాసుకో
డైరీలో రాయండి. ‘దేవ్‌డా... మేమా డైరీనా?’ అంటారా? కొనొద్దులేగానీ.. ఫోన్ తీసి డైరీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. జర్నీ, డైరీ విత్ లాక్, డే డైరీ, ప్రైవేట్ డైరీ.. యాప్‌లను ప్రయత్నించొచ్చు. ట్విట్టర్‌లో ట్వీట్ చేసినట్టుగానే చిట్టిపొట్టి మాటలే రాయండి. కొన్ని డెస్క్‌టాప్ వెర్షన్లూ ప్రయత్నించొచ్చు. మీరేం రాసినా వారానికోసారి పూర్తిగా చదవండి. గమ్మత్తుగా ఉంటుంది!
* ఇదే మంచి టైమ్
టైం టేబుల్ వేయండి. ‘సెలవుల్లోనూ తప్పదా!’ అనుకోవద్దు. టైం టేబుల్ వేయడమంటే సమయం చేతిలో మనం బంధీ కావడం కాదు. మన ఇష్టాయిష్టాలకు తగ్గట్టు సమయాన్ని బంధించడం! మనం చేయాలనుకున్న పనుల కోసం కాలాన్ని నేర్పుగా వాడుకోవడం! ఆల్రెడీ మీ లోపాలు.. వాటి పరిష్కారాలు, మీకు చాలా నచ్చిన విషయాలపై ఓ నిర్ణయానికి వచ్చే ఉంటారు. మీ డైలీ టైంటేబుల్‌లో వాటిని భాగం చేసుకోండి. వాటికి కాస్త అటూఇటూ వీటినీ ప్రయత్నించండి...
* ప్లస్‌లు... మైనస్‌లు
క్లాస్ నోట్స్... ఎసైన్‌మెంట్స్... ఉండవుగా. అందుకే మీకు మీరే కొన్ని కొత్తవి ఎసైన్ చేసుకోండి. ఫ్రెండ్స్ అంతా గ్రూపుగా ఏర్పడి విశ్లేషించుకోండి. ఎలాగోలా బతిమిలాడి మీ ‘మైనస్‌లు... ప్లస్‌లు’ రాయమనండి. వాటిలో తిట్లూ.. వెక్కిరింపులు.. వెర్రివేషాలు ఏవి ఉన్నా ఫర్వాలేదు. జస్ట్ రాయమనండి. వాళ్ల గురించి మీరూ రాయండి. వెకేషన్ ముగిసేలోపు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి.
* వీఐపీ ట్రెండ్స్
మీకిష్టమైన పది మంది వీఐపీలని ఎంచుకోండి! వారిలో మీకు నచ్చిన అంశాలు.. వాళ్లని గొప్పగా మార్చిన సంఘటనలు రాయండి. తప్పకుండా వారిలోని పాజిటివ్ అంశాలన్నీ మీలోనూ ఎంతోకొంత ఉంటాయి..! వాటిని పెంచుకునే ప్రయత్నంలో పడటమే ఇక మీ పని.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?