జేబు బనియన్లు

సైన్‌ బనియన్లు చూశారా? గతంలో మన తాతలు ధరించేవారు. కొంచెం లూజుగా... మధ్యలో జేబు ఉండీ... గుర్తొచ్చిందా? ఆ... అలాంటిదాన్ని కొంచెం నవీకరించి మార్కెట్లోకి తెచ్చారు ఈ ముగ్గురు యువకులు....

Published : 12 May 2018 01:24 IST

టీహబ్‌ మెచ్చిన
జేబు బనియన్లు

సైన్‌ బనియన్లు చూశారా? గతంలో మన తాతలు ధరించేవారు. కొంచెం లూజుగా... మధ్యలో జేబు ఉండీ... గుర్తొచ్చిందా? ఆ... అలాంటిదాన్ని కొంచెం నవీకరించి మార్కెట్లోకి తెచ్చారు ఈ ముగ్గురు యువకులు. మంచి అమ్మకాలతో పాటు, ప్రశంసలందుకొన్నారు. జేబులో దాచుకున్న డబ్బు పోగొట్టుకోవడంతో... వచ్చిన మెరుపులాంటి ఆలోచనను ఆచరణలోకి తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌కు చెందిన పున్నంచందర్‌, గాజుల దిలీప్‌, జక్కు శివకుమార్‌ మిత్రులు. పున్నంచందర్‌కు వచ్చిన ఆలోచన తన ఇద్దరు మిత్రులతో పంచుకున్నాడు. ముగ్గురూ కలిసి బనియన్లకు జేబులు పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఆ జేబులోనివి పడిపోకుండా దానికి జిప్‌ కూడా పెట్టాలనుకున్నారు. తమకు సొంత పరిశ్రమ లేక... చెన్నై వెళ్లి అక్కడ ఓ పరిశ్రమతో ఒప్పందం చేసుకొని తమ కాన్సెప్ట్‌తో తయారు చేశారు. సేఫ్‌ బనియన్‌ పేరుతో మార్కెట్లోకి వదిలారు. మంచి ఆదరణ లభించింది. టీహబ్‌ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో ఐదో ఉత్తమ ప్రదర్శన పురస్కారం లభించింది. ఈ ప్రోత్సాహం వల్ల లభించిన ఉత్సాహంతో యువకులు మరింతగా బనియన్లు ఆధునికీకరించి మార్కెట్లోకి తేనున్నారు. ఫుల్‌, కట్‌, రంగుల్లో సేఫ్‌ బనియన్లు తయారు చేసే పనిలో ఉన్నారు. మా బనియన్లతో డబ్బే కాకుండా సెల్‌ఫోన్లు, బంగారం, ఇతర చిన్న వస్తువులు భద్రంగా తీసుకుపోవచ్చని, ఈ వసతే మమ్మల్ని మార్కెట్లో భిన్నంగా నిలబెడుతోందని చందర్‌, దిలీప్‌, శివకుమార్‌ చెప్పారు.

- న్యూస్‌టుడే, కమలాపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని