గడ్డం పెరుగుతోందా? పెంచుతున్నారా?
లుక్...చెక్
గడ్డం పెరుగుతోందా? పెంచుతున్నారా?
అదేంటి అలా అడుగుతారు? గడ్డం ఎవరికైనా పెరుగుతుంది కదా! పెంచడమేంటి.. అంటారా! దానంతట అదే పెరిగితే ఏమొస్తుంది? మనం పెంచితే అందాన్ని అది రెట్టింపు చేస్తుంది.
వాస్తవంగా గడ్డం సక్రమంగా, సరిగ్గా, అందంగా పెంచడమనేది ఎక్కువ మంది యువకుల కల. కొంతమందికే అబ్బిన కళ.
ఇప్పుడు గడ్డం ఎంత ఫ్యాషనో పెద్దగా చెప్పక్కర్లేదు. యువతకు ఐకాన్‌లా నిలిచే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ గడ్డం తీయనని, అది తనకు ఎంతో నచ్చిందని మరోసారి చెప్పడంతో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. మరి మీరూ దాన్ని ఫాలో అయ్యి కొత్తగా కన్పించాలంటే ఏం చేయాలి? కొంత సాధన చేయాలి. ఓపిక, క్రమశిక్షణ ఉండాలంటున్నారు హెయిర్‌స్టైలిస్టులు. అప్పుడే అందమైన గడ్డంతో మ్యాన్లీ లుక్‌తో తిరిగేయొచ్చంటున్నారు. మరి దీనికి చేయాల్సిందేమిటి?
నూనె రాయాలి : రోజూ కొంత ఆయిల్ గడ్డానికి రాస్తే మంచిది. అప్పుడు వెంట్రుకలు మృదువుగా మారతాయి. క్రమంగా పెరుగుతాయి. పైగా దురద తగ్గిపోతుంది. మాయిశ్చురైజింగ్‌కు కొబ్బరినూనె సరిపోతుంది.
అప్పుడే కట్ చేయొద్దు : కొంచెం పెరగ్గానే లుక్ బాగాలేదని కొందరు ట్రిమ్ చేస్తారు. దీనివల్ల సరైన రూపంలోకి తెచ్చుకొనే అవకాశం పోతుంది. అందుకే వెంట్రుకలు గొంతుపై కనిపించే ఆడమ్స్ ఆపిల్(మెడ సగభాగం) వరకూ పెరగనివ్వాలి. పూర్తిగా పెరిగిన తర్వాత మనకు కావాల్సిన లుక్‌లోకి ట్రిమ్ చేసుకోవచ్చు.
సరైన్ డైట్ : వెంట్రుకలు బాగా, తొందరగా పెరగాలంటే చక్కని ఆహారం అవసరం. ఏ, బీ, సీ, ఈ విటమిన్లు వెంట్రుకల పెరుగుదలకు దోహదపడతాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకొంటే ఫలితం కన్పిస్తుంది. గుడ్లు, మాంసం, చేపలు, పాలు ఆహారంలో ఉండేట్లు చూసుకోవాలి.రోజూ శుభ్రం : గడ్డానికి ప్రత్యేకంగా షాంపులు మార్కెట్లో దొరుకుతాయి. వీటిని ఉపయోగించి కనీసం రోజుకు ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే వెంట్రుకలు పెరుగుతున్నప్పుడు ముఖంపై జిడ్డు, మట్టి చేరి అలర్జీలు వచ్చే ప్రమాదముంది. పైగా దురద లేకుండా ఈ శుభ్రత తోడ్పడుతుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Best Fielder: ప్రస్తుతం ప్రపంచంలో బెస్ట్ ఫీల్డర్ అతడే: జాంటీ రోడ్స్
-
India News
Divya Spandana: అప్పుడు రాహులే నాకు మానసిక ధైర్యం ఇచ్చారు: నటి వ్యాఖ్యలు
-
Movies News
Pathu Thala: వారికి థియేటర్లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్..
-
Politics News
Bandi sanjay: కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలెందుకు భరించాలి? సహించాలి?: బండి సంజయ్
-
General News
Andhra News: పోలీసులకు ఎదురుదెబ్బ.. అంజన్‌ను విడుదల చేయాలని కోర్టు ఆదేశం
-
India News
Karnataka: భాజపా.. కాంగ్రెస్.. ముఖ్యమంత్రి ‘ముఖచిత్రం’ ఉంటుందా..?