అక్కా అంటున్నా అదే ఆలోచన

ఆఫీసులో నా వయసే ఉన్న ఓ అమ్మాయి పరిచయమైంది. తనని అక్కా అని పిలుస్తున్నా. కానీ నేను ఆ అమ్మాయిని చూడకుండా, మాట్లాడకుండా...

Published : 26 Mar 2016 02:16 IST

అక్కా అంటున్నా అదే ఆలోచన

ఆఫీసులో నా వయసే ఉన్న ఓ అమ్మాయి పరిచయమైంది. తనని అక్కా అని పిలుస్తున్నా. కానీ నేను ఆ అమ్మాయిని చూడకుండా, మాట్లాడకుండా క్షణం ఉండలేకపోతున్నా. ఇది ఆకర్షణా? ప్రేమా? ఎలాంటి బంధమో నాకే అర్థం కావడం లేదు. తనకి పెళ్లైంది. ఆమెని మర్చిపోవడం ఎలా?

సాయి, హైదరాబాద్‌

వ్వనంలో ఉన్నపుడు అందమైన అమ్మాయిలను చూసినపుడు ఆకర్షణ కలగడం సహజం. రుచికరమైన ఆహారాన్ని చూసినపుడు నోరూరడంలాగే ఇదీ సహజమైన చర్య. దీన్ని నియంత్రించుకోవడం కూడా సాధ్యమే. మనసులో 'ఇడ్‌’, 'ఇగో’, ఖసూపర్‌ 'గో’ అనే మూడు భాగాలుంటాయని ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ ప్రతిపాదించారు. ఆలోచన, విచక్షణ లేకుండా మనసులోకి వచ్చిన ప్రతి కోరికను తక్షణం తీర్చుకొమ్మని ఇడ్‌ ప్రోత్సహిస్తుంది. సూపర్‌ ఇగో ఆదర్శవాదం, నైతిక విలువలకు అనుగుణంగా జీవితం గడపమంటుంది. ఇగో అవకాశాన్ని బట్టి ఇడ్‌, సూపర్‌ ఇగోల మధ్య వూగిసలాడుతుంది. అంటే మన మనసులో ఇడ్‌ (కాంక్ష), సూపర్‌ ఇగో (ఆదర్శం) మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఇగో దేనివైపు మొగ్గుచూపితే అదే నెగ్గుతుంది.

మీ విషయానికొస్తే మీ కొలీగ్‌ని అక్కా అని పిలవడం ద్వారా ఆదర్శవంతంగా ఉండేందుకు తొలి ప్రయత్నం చేశారు. తర్వాత అదుపులేని ఆలోచనలు సవరించుకోవడానికి మానసిక నిపుణుల సలహా కోరడం అభినందనీయమే. ఇక మనసులోకి రకరకాల వూహలు రావడం సహజం. చెడ్డ ఆలోచనలు తక్షణం ఖండించి దానిస్థానంలో మంచిని ప్రవేశపెట్టేందుకు మనం ప్రయత్నించాలి. ఉదాహరణకు కుటుంబ సభ్యుడు బయటికెళ్లి సమయానికి తిరిగి రాకపోతే ముందు ప్రమాదం జరిగిందేమో అని భయపడతాం. వెంటనే కాదులే ఎవరైనా తెల్సినవాళ్లతో మాట్లాడుతున్నారేమో, ట్రాఫిక్‌ జాం అయ్యిందేమోనని సర్దిచెప్పుకుంటాం. అలాగే ఆమె గురించి చెడు ఆలోచనలు వస్తే వెంటనే వాటి స్థానంలో మంచివాటిని ప్రవేశపెట్టండి.

ముందు ఆ అమ్మాయిని అక్కగా మీ కుటుంబానికి పరిచయం చేయండి. ఆమెతో రాఖీ కట్టించుకోండి. మిమ్మల్ని తమ్ముడిగా ఆమె భర్తకి పరిచయం చేయమనండి. ఇదంతా కొంచెం గందరగోళంగా ఉన్నా ప్రయత్నిస్తూ ఉంటే మనసు మీ మాట వింటుంది. అప్పుడూ ఇడ్‌ మిమ్మల్ని చెడు ఆలోచనలవైపు నెడుతుంది. ఖఆచరణలో ఏమీ చేయకున్నా కనీసం వూహల్లో అయినా సంతోషించు’ అని రెచ్చగొడుతుంది. లొంగిపోవద్దు. ఆచరణలో సాధ్యంకాని వూహలవల్ల నష్టం తప్ప లాభం ఉండదు. ఖనీ మాట వింటే పరువు పోగొట్టుకుంటాను. అందరి ముందూ దోషిగా నిలబడతాను. ముఖ్యంగా నన్ను అభిమానించే అమ్మాయి అసహ్యించుకుంటుంది’ అని మీ ఇడ్‌ని అదుపులో పెట్టుకోండి. నిదానంగా మీ ఇగో కూడా ఇడ్‌ని నియంత్రించడం ప్రారంభిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని