నువ్వనీ.. నేననీ!

‘హాయ్‌ జానూ.. నా ప్రేమ గురించి నీతో ఏమని వర్ణించేది? ఇంతకీ నేను నీకెలా కనిపిస్తున్నా? ఏం చేస్తే నీకు నచ్చుతాను? మనది నిజమైన ప్రేమేగా?...

Published : 21 May 2016 01:13 IST

నువ్వనీ.. నేననీ!

‘హాయ్‌ జానూ.. నా ప్రేమ గురించి నీతో ఏమని వర్ణించేది? ఇంతకీ నేను నీకెలా కనిపిస్తున్నా? ఏం చేస్తే నీకు నచ్చుతాను? మనది నిజమైన ప్రేమేగా? రేప్పొద్దున నువ్వెవరని నన్నడిగి నా కలల్ని కల్లలు చేయవుగా? రకరకాల ప్రశ్నలతో నా బుర్ర వేడెక్కుతోంది. ఐలవ్యూ జాన్‌’ ఇదీ బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ హృతిక్‌కి పంపినట్టుగా చెబుతున్న ఈమెయిల్‌ సారాంశం. అంతేకాదు నీ జవాబు లేక ‘యాస్పెర్జర్స్‌ సిండ్రోమ్‌’తో బాధ పడుతున్నానని వాపోయింది ఆ భామ. వాళ్ల ప్రేమయుద్ధం సంగతలా ఉంచితే ఇప్పుడు ఈ మాటే హాట్‌ టాపిక్‌ అయింది. ఓ లైఫ్‌స్టైల్‌ వెబ్‌సైట్‌ అధ్యయనం ప్రకారం యువతలో 18 శాతం ఇలాంటి మానసిక భావనతోనే ఉన్నారంటోంది. పూర్తి వివరాలివిగో.

* షారూఖ్‌ మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌ సినిమాలోని రిజ్వాన్‌ఖాన్‌ పాత్రతో యాస్పెర్జర్స్‌ సిండ్రోమ్‌ మాట వెలుగులోకి వచ్చింది. దీన్నో మానసిక సమస్యగానే పరిగణిస్తారు సైకాలజిస్టులు.
* అతిగా స్పందించడం.. అతిగా వూహించుకోవడం.. సామాజిక ఒంటరితనం తట్టుకోలేకపోవడం.. భావోద్వేగాలు వ్యక్తపరచడంతో తీవ్రంగా తడబడటం దీని లక్షణాలు.
* నచ్చిన వ్యక్తి పక్కనే ఉన్నా వేల మైళ్ల దూరంలో ఉన్నట్టు భ్రమిస్తారు. తను, ఆమె దక్కకుండా పోతారని అనుక్షణం భయపడతారు.
* నిత్యం వూహా ప్రపంచంలోనే బతికేస్తుంటారు. అది వూహ కాదు నిజం అంటే తట్టుకోలేరు.
* ప్రాణమిచ్చేలా ప్రేమించినా లవర్‌ కళ్లలో కళ్లు పెట్టి చూడాలంటే భయం. దాన్ని అసౌకర్యంగా ఫీలవుతారు.
* భాషని, భావాల్ని అర్థం చేసుకోవడంలో ఎవరికేమాత్రం తీసిపోరు. భావ వ్యక్తీకరణతోనే సమస్యంతా.
* తీవ్రమైన పని ఒత్తిళ్లు ఉన్నవారు, అంతర్జాలంలో అధిక సమయం గడిపేవాళ్లు, తమ అభీష్టానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పని చేసేవాళ్లలో ఈ సమస్య ఎక్కువంటున్నారు మానసిక నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని