అంతర్ముఖుల అంతరంగం

నలుగురిలో కలవలేరు.. మూడీగా ఉంటారు.. పొగరెక్కువ.. ఆనందం విలువ తెలియదు.. అంతర్ముఖులంటే ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం.

Published : 15 Oct 2016 00:49 IST

అంతర్ముఖుల అంతరంగం

నలుగురిలో కలవలేరు.. మూడీగా ఉంటారు.. పొగరెక్కువ.. ఆనందం విలువ తెలియదు.. అంతర్ముఖులంటే ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. వీటిలో చాలావరకు అవాస్తవం అంటోంది ఓ అధ్యయనం. ఆ వివరాలు..

* నలుగురిలో కలవలేనంత మాత్రాన వారికి సాటివాళ్లంటే ఇష్టం లేదని కాదు. ఒక్కసారిగా ఎక్కువమందిని చూసేసరికి వారిలో అనవసర ఆందోళన మొదలవుతుంది. మాట కరువైపోతుంది. అంతే.

* అంతర్ముఖులు వసపిట్టలా అదేపనిగా మాట్లాడలేకపోవచ్చు. కానీ ఏకాంతంగా ఉన్నపుడు వాళ్ల మనసుకు నచ్చిన ఓ టాపిక్‌ ఎత్తుకోండి. అందంగా, ఆకట్టుకునేలా మాట్లాడగల నైపుణ్యం వారి సొంతం.

* ఏకాంతం కోరుకోవడం.. ఓ మూలన కూర్చోవడం వారి పద్ధతి. అయినా చొరవగా పలకరించేవాళ్లను అంతర్ముఖులు ఎక్కువగా ఇష్టపడతారు. వారితోనే త్వరగా స్నేహం చేస్తారు.

* ఇంట్రావర్ట్‌ల్లో 90శాతం మందికి తమ మనస్తత్వం నచ్చదట. అందరితో కలుపుగోలుగా ఉండాలని, గలగలా మాట్లాడాలని ఎక్కువమంది భావిస్తారు.

* చాలా సందర్భాల్లో వీరికి పొగరనీ, గర్వమనీ ఇతరులు అపార్థం చేసుకుంటారు. అంతర్ముఖులు ఎక్కువగా బాధపడేది ఇలాంటి మాటలకే. అయినా వారి తీరు మారదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని