జరసోచో

వరుణ్‌ ఐసీయూలో ఉన్నాడు. అతనికి ఫేస్‌బుక్‌లో 3,657 మంది మిత్రులున్నారు. ట్విట్టర్‌లో 1,548 ఫాలోయర్స్‌... 1987 వాట్స్‌యాప్‌ కాంటాక్ట్‌లు... 250 వాట్స్‌ఆప్‌ గ్రూపులు ఉన్నాయి....

Published : 18 Nov 2017 01:51 IST

జరసోచో

రుణ్‌ ఐసీయూలో ఉన్నాడు. అతనికి ఫేస్‌బుక్‌లో 3,657 మంది మిత్రులున్నారు. ట్విట్టర్‌లో 1,548 ఫాలోయర్స్‌... 1987 వాట్స్‌యాప్‌ కాంటాక్ట్‌లు... 250 వాట్స్‌ఆప్‌ గ్రూపులు ఉన్నాయి.... కానీ, ఐసీయూ బయట  కుటుంబం మాత్రమే ఉంది. త్వరగా కోలుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ, గతంలో వరుణ్‌ మాత్రం వీరి కోసం పెద్దగా సమయం కేటాయించే వాడు కాదు. పిలిస్తే పలికేవాడే కాదు... ఎప్పుడూ... ఫోన్‌... దాంట్లో ఛాటింగ్‌లు! ఫ్రెండ్స్‌... ఇంటర్నెట్‌ మాయలో ఇంట్లో వాళ్లతో ఎలా గడుపుతున్నామో ఒక్కసారి ఆలోచించండి. వాట్స్‌యాప్‌లోనే కాకుండా వాస్తవ  ప్రపంచంలోనూ గడపండి.

   - మల్లిక్‌, కామవరపుకోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని