కట్ చేస్తే.. కత్తిలాంటి ఫ్యాషన్
సినీ తారలంటే అభిమానుల దృష్టిలో ఆకాశం నుంచి దిగొచ్చిన తారలే. వాళ్ల అందాన్ని రెట్టింపు చేయడంలో వాళ్లు ధరించే ఔట్‌ఫిట్‌లది కీలక పాత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
సినీ తారలంటే అభిమానుల దృష్టిలో ఆకాశం నుంచి దిగొచ్చిన తారలే. వాళ్ల అందాన్ని రెట్టింపు చేయడంలో వాళ్లు ధరించే ఔట్‌ఫిట్‌లది కీలక పాత్ర అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే మరి తరచూ కొత్త ఫ్యాషన్లకి తమ ఒంటిపై చోటిస్తారు. సొగసులకు చిరునామాగా ఉంటారు ఆ నారీమణులు. ఆ ఊపులోనే టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అందరూ ఆదరిస్తున్నవి కటౌట్ డ్రెస్‌లు. ‘శాకుంతలం’ ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్ అగ్ర నాయిక సమంత కటౌట్ మాక్సీ డ్రెస్ వేసి ఆకట్టుకుంది. అంతకుముందు ముదురు భామ మలైకా అరోరా ఒక పుట్టినరోజు పార్టీలో బస్ట్ కటౌట్‌తో కవ్వించింది. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీల జాబితాకెక్కుతున్న షారుక్‌ఖాన్ తనయ సుహానా సైతం తెలుపు రంగు కాటన్ కటౌట్ డ్రెస్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ని ముంచెత్తింది. ‘హీరోపంతీ’ భామ కృతి సనన్ సైతం.. నలుపు రంగు గౌనుకి వీ ఆకారం కటింగ్ ఇచ్చుకొని ముంబయిలో ఓ ఫ్యాషన్ స్టోర్ ప్రారంభానికొచ్చింది. దీన్ని ప్రముఖ డిజైనర్ల ద్వయం శంతను-నిఖిల్ రూపొందించారట. నడుము, వీపు, ఉదరం, వక్షం, కాళ్లు.. ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ కటౌట్‌తో తమ అందాన్ని ఇనుమడింపజేయడానికే ఈ ట్రెండ్‌ని తారామణులు ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్లే కాదు.. ఆధునికంగా కనిపించాలనుకునే మెట్రో నగరాల్లోని అమ్మాయిలూ ఈ ఫ్యాషన్‌ని ఇష్టపడుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023 : కోట్లు పెట్టి కొన్నా.. కొట్టింది కొందరే..
-
Crime News
Hyderabad: సోదరి నైటీలో వచ్చి చోరీ.. బెడిసి కొట్టిన సెక్యూరిటీ గార్డ్ ప్లాన్
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kiran Kumar Reddy: నాకున్న అనుభవంతో భాజపా బలోపేతానికి కృషి చేస్తా: కిరణ్ కుమార్ రెడ్డి
-
Crime News
Prakasam: అప్పుడే పుట్టిన శిశువును సంచిలో కట్టి.. గిద్దలూరులో అమానుషం!
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?