Published : 11 Mar 2023 00:22 IST

వ్యాయామంతో యవ్వనం

సరత్తులు చేస్తే కలిగే ప్రయోజనాలు బోలెడని కుర్రకారు ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. వ్యాయామంతో ఫిట్‌నెస్‌ సొంతమవుతుంది. ఆరోగ్యంగా ఉంటాం. బరువు తగ్గుతాం. కండలు పెరుగుతాయి. ఇంతేనా? ఇప్పుడో కొత్త సంగతి తెలిసింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే యవ్వనం తరిగిపోకుండా ఉంటుందట. ముఖ్యంగా వయసు పెరిగినకొద్దీ వచ్చే కొన్ని రకాల రుగ్మతలు దరి చేరకుండా ఉంటాయంటున్నారు పరిశోధకులు. ‘క్లినికల్‌ న్యూట్రిషన్‌ అండ్‌ మెటబాలిక్‌ కేర్‌’ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. వారానికి 150 నిమిషాల పాటు వ్యాయామం చేయడం వల్ల ఈ ఫలితాలు దక్కుతాయట. కసరత్తులు చేసినప్పుడు అన్ని అవయవాలకు ఆక్సిజన్‌ అంది.. మజిల్‌ మాస్‌ వృద్ధి చెంది.. కొన్నిరకాల క్యాన్సర్లు దరిచేరవట. వయసురీత్యా వచ్చే సమస్యలూ తగ్గుతాయంటున్నారు పరిశోధకులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు