మిలన్‌లో అరుణ మిలమిలలు

అంతకుముందు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. గతేడాది లండన్‌ ఫ్యాషన్‌వీక్‌.. తాజాగా మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో సందడి. హైదరాబాదీ ఫ్యాషన్‌ డిజైనర్‌ అరుణ గౌడ్‌ తన డిజైన్లతో ప్రపంచ వేదికలపై దూసుకెళ్తూనే ఉంది.

Published : 04 Mar 2023 00:26 IST

అంతకుముందు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. గతేడాది లండన్‌ ఫ్యాషన్‌వీక్‌.. తాజాగా మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో సందడి. హైదరాబాదీ ఫ్యాషన్‌ డిజైనర్‌ అరుణ గౌడ్‌ తన డిజైన్లతో ప్రపంచ వేదికలపై దూసుకెళ్తూనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక షోలలో తాము రూపొందించిన ఔట్‌ఫిట్‌లు ప్రదర్శించాలని ప్రతి డిజైనర్‌ ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఈ అరుదైన అవకాశం దక్కేది అతి కొద్దిమందికే. రకరకాల వడపోతల అనంతరం ఎంపిక చేస్తుంటారు. ఈ సంవత్సరం మిలన్‌ ఫ్యాషన్‌ షోలో భారత్‌ నుంచి ఇద్దరికి మాత్రమే ఈ అవకాశం దక్కగా.. అందులో ఒకరు అరుణ. తను అంతర్జాతీయంగా పేరున్న మైఖేల్‌ సింకో, జోజో బ్రగాయిస్‌లాంటి వాళ్లతో కలిసి పాల్గొంది. ఆమె రూపొందించిన కాక్‌టెయిల్‌ గౌన్లతో షో స్టాపర్‌గా నిలిచింది. ‘స్కూబా, స్ట్రెచబుల్‌ మెటీరియల్‌తో ఈ డిజైన్లు రూపొందించాను. ఇవి పార్టీలు, ఫ్యాషన్‌ ఈవెంట్లకు అనుకూలంగా ఉంటాయి. ఈ డిజైన్లు ధరించిన మోడళ్లు ప్రఖ్యాత ఫ్యాషన్‌ షోలో క్యాట్‌వాక్‌ చేస్తూ ప్రదర్శించడం సంతోషంగా, గర్వంగా ఉంది’ అంటోంది అరుణ.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని