ఫ్రేముబంధం.. ప్రేమబంధమై!
తెరపై ప్రేమికులుగా నటించి కుర్రకారులో గిలిగింతలు పెట్టిన నాయకానాయికలు వాళ్లు. నిజ జీవితంలోనూ ప్రేమ బాట పట్టి పెళ్లితో ఒక్కటయ్యారు.
తెరపై ప్రేమికులుగా నటించి కుర్రకారులో గిలిగింతలు పెట్టిన నాయకానాయికలు వాళ్లు. నిజ జీవితంలోనూ ప్రేమ బాట పట్టి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆ జంటలెవరు? పరిణయం కథేంటి? సంక్షిప్తంగా...
ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ
దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేసి ఒక్కటైందీ జంట. ఈ ఇద్దరూ రెండు సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి పరిచయమే ప్రేమగా మారింది. రెండేళ్ల కిందట ఓ కుటుంబ కార్యక్రమంలో నిక్కీ ఉండటంతో ఈ ఇద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని తేలింది. చివరికి గతేడాది మేలో ఈ జంట పెళ్లితో ఒక్కటైంది.
కత్రినా కైఫ్- విక్కీ కౌశల్
ఈ జంట పరిచయం విచిత్రంగా జరిగింది. ‘కాఫీ విత్ కరణ్’ షోలో ‘నీకు బాలీవుడ్‌లో నచ్చే మగాడు ఎవరు?’ అని కరణ్‌జోహార్ కత్రినాని అడిగాడు. కాస్త ఆలోచించి ‘విక్కీ కౌశల్’ అంది కత్రినా. అలా వాకబు మొదలై, తర్వాత ఇద్దరూ కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకోవడం చకచకా జరిగిపోయాయి. గతేడాది మార్చిలో అధికారికంగా ఒక్కటయ్యాం అని ప్రకటించారు.
నాగశౌర్య- అనూష శెట్టి
బెంగళూరు అమ్మాయి అనూష శెట్టి ఇంటీరియర్ డిజైనర్. ఆమె పని నైపుణ్యం నచ్చి పరిచయం పెంచుకున్నాడు మన తెలుగు యువ హీరో నాగశౌర్య. అది ప్రేమగా మారడానికి ఎంతోకాలం పట్టలేదు. వృత్తిగతంగా దగ్గరైన ఈ ప్రేమికులు గతేడాది నవంబరులో ఒకింటివారయ్యారు.
అలియా భట్-రణ్‌బీర్ కపూర్
బహుకాలపు ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్ అలియాభట్‌లు తమ ప్రేమాయణానికి ఫుల్‌స్టాప్ పెట్టి గతేడాది ఏప్రిల్‌లో పెళ్లి పీటలెక్కారు. ఒక సినిమా షూటింగ్ కోసం ఒకే విమానంలో ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు మొదలైన పరిచయం.. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో ముదిరి పాకాన పడింది. కొన్నేళ్లు మీడియాతో దాగుడు మూతలాడి ఏడాది కిందట వివాహ బంధంతో పెనవేసుకుపోయారు.
నయనతార- విఘ్నేష్ శివన్
ఈ జంటదీ లాంగ్‌టర్మ్ ప్రేమాయణమే. వీళ్లు ఆ సాన్నిహిత్యాన్ని ఎప్పుడూ దాచుకునే ప్రయత్నం చేయలేదు. సామాజిక మాధ్యమాల్లో జంటగా కనువిందు చేశారు. కెమెరాలకు పోజులిచ్చారు. చివరికి గతేడాది జూన్‌లో తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగవైభవంగా పెళ్లాడారు.
కియారా అడ్వాణీ- సిద్ధార్థ్ మల్హోత్రా
కలిసి కెమెరాలకు చిక్కారు.. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు అప్‌లోడ్ చేశారు. అయినా ‘మామధ్య ఏం లేద’ని చెబుతూనే ఉన్నారు. రహస్యం ఎప్పుడో బట్టబయలు కావాల్సిందేగా. కియారా బర్త్‌డే పార్టీలో ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటికొచ్చినప్పుడు ప్రేమ ఉందని ఒప్పుకున్నారు. ఎట్టకేలకు ఈ ఫిబ్రవరి 7న ఒక్కటయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi sanjay: అందుకే ఈనెల 15న ఖమ్మంలో అమిత్‌షా సభ: బండి సంజయ్
-
India News
Amruta Fadnavis: ‘ఏక్నాథ్ శిందేను ట్రాప్ చేయాలన్నది మీరేగా’: అమృతా ఫడణవీస్‌కు బుకీ మెసేజ్..!
-
India News
Dhanbad: అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లెందరో?!
-
General News
TSPSC ప్రశ్నపత్రం లీకేజీ.. రూ.1.63 కోట్ల లావాదేవీలు: సిట్
-
Politics News
Revanth Reddy: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: రేవంత్ రెడ్డి
-
General News
Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి