ప్రేమ అతిశయం..పెళ్లి వైభోగం!
అమ్మడిది సినిమా నేపథ్యం.. అతగాడికి క్రికెట్టే సర్వస్వం. ఆ ఇద్దరూ అతియా శెట్టి, కేఎల్ రాహుల్‌లు. ప్రేమలో మునిగి తేలారు.. పెళ్లితో ఒక్కటయ్యారు! సినిమా, క్రికెట్‌ని ఓ మతంలా భావించే యంగిస్థాన్‌ల కోసం.. ఈ కొత్త జంట వలపు కహానీ ముచ్చట్లు ఇవి.
అలా మొదలైంది: రాహుల్-అతియాల ప్రేమకథ 2019లో మొదలైందని అంటుంటారు. ఏమో.. అంతకుముందే అయ్యుండొచ్చేమో! ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా మొదట్లో ఇద్దరికీ పరిచయమైంది. ఇద్దరూ కర్ణాటక మూలాలున్నవారు కావడంతో తొందర్లోనే అది ప్రణయం బాట పట్టింది. ఈ బంధాన్ని బహిర్గతం చేయకుండా ఎప్పటికప్పుడు దాచుకుంటూనే వచ్చారు. అయితే ఫ్యాషన్ డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ ఈ జంట ప్రేమకథని పరోక్షంగా ప్రస్తావించడంతో వీళ్ల సంగతి లోకానికి తెలిసింది. తర్వాత అదే ఏడాది డిసెంబరులో ఈ ఇద్దరూ కలిసి థాయ్‌లాండ్‌లో సరదాగా విహారం చేస్తున్న ఫొటోల్ని అంతర్జాలంలో పంచుకున్నారు. తర్వాత పుట్టిన రోజులకి, ప్రేమికుల రోజులకి స్వీట్, క్యూట్ సందేశాలు పంపుకోవడంతో.. ఈ ఇద్దరి మధ్యా సమ్‌థింగ్ సమ్‌థింగ్ ఉందని రూఢీ అయ్యింది.
వాణిజ్య ప్రకటనలు: ఓ ఫ్రెంచి లగ్జరీ కళ్లద్దాల సంస్థకి చెందిన వాణిజ్య ప్రకటనలో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అప్పుడే ఈ ఫ్రేము బందం ప్రేమ బంధంగా మరింత బలపడింది. తర్వాత అతియ సోదరుడు అహన్ నటించిన ‘తడప్’ సినిమాకి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకొని వచ్చినప్పుడే కుటుంబ ఆమోదం సైతం ఉందని తేటతెల్లమైంది. కేఎల్ రాహుల్ అణకువ, తన అమ్మానాన్నలు ఉన్నత విద్యావంతులు కావడంతో అతియ నాన్న ప్రముఖ నటుడు సునీల్ శెట్టి సైతం కూతురి ఎంపిక మంచిదేనంటూ ప్రోత్సహించారు.
కల్యాణ వైభోగం: కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమ పక్షుల పెళ్లి తంతు జనవరి 21న మొదలైంది. మూడు రోజులపాటు జరిగిన ఈ వేడుకకి ముంబయి దగ్గర్లోని ఖండాలాలో ఉన్న సునీల్ శెట్టి విలాసవంతమైన ఫాంహౌజ్ వేదికైంది. అక్కడ వీళ్ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మొదట కాక్‌టెయిల్ పార్టీతో మొదలు పెట్టి.. హల్దీ, మెహిందీ.. తర్వాత పెళ్లి నిర్వహించారు. అతియా.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన లేత గులాబీ చికాంకారీ లెహెంగా ధరించి రాగా.. రాహుల్ ఐవరీ షేర్వాణీ, ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి ఓవర్‌కోట్, దుపట్టా ధరించి ముస్తాబయ్యాడు.
క్రికెట్-సినిమా చెట్టపట్టాల్
*అలీఖాన్ పటౌడీ- షర్మిలా ఠాగోర్
* సర్ వివియన్ రిచర్డ్స్-నీనా గుప్తా
*మహ్మద్ అజారుద్దీన్-సంగీతా బిజ్‌లానీ
* విరాట్ కోహ్లి- అనుష్క శర్మ
*హర్భజన్‌సింగ్- గీతా బస్రా
*జహీర్‌ఖాన్- సాగరికా ఘట్కే
* యువరాజ్‌సింగ్- హేజెల్ కీచ్
*హార్ధిక్ పాండ్యా- నటాషా స్టాన్కోవిక్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Plant Fungi: మనిషికి సోకిన ‘వృక్ష శీలింధ్రం’.. ప్రపంచంలోనే తొలి కేసు భారత్‌లో!
-
Sports News
GT vs CSK: గుజరాత్ బోణీ.. చెన్నైపై 5 వికెట్ల తేడాతో విజయం
-
India News
Navjot Singh Sidhu: జైలు నుంచి విడుదల కానున్న సిద్ధూ..!
-
World News
NATO: తుర్కియే గ్రీన్ సిగ్నల్... నాటో కూటమిలోకి ఫిన్లాండ్!
-
Movies News
Pathaan: ‘బేషరమ్ రంగ్’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?
-
Politics News
Yediyurappa: వరుణ నుంచి కాదు.. నా సీటు నుంచే విజయేంద్ర పోటీ: యడియూరప్ప క్లారిటీ!