కార్యాలయమే.. కసరత్తుల కేంద్రం
పని పరిగెత్తాలంటే.. కుర్ర ఉద్యోగులు ఫిట్‌గా ఉండాలి. కానీ కంప్యూటర్‌కే గంటలకొద్దీ అతుక్కుపోతుంటే చురుకుదనం ఎలా ఉంటుంది? పైగా కొత్తకొత్త్త రోగాల బారిన పడుతున్నారు చాలామంది. దాన్ని తప్పించుకోవడానికి ఆఫీసునే అప్పుడప్పుడు కసరత్తుల కేంద్రంగా మలచుకుంటే పోలా.
డెస్క్ పుషప్‌లు: కార్యాలయంలోని డెస్క్‌పై చేతులు పెట్టి కాళ్లను వెడల్పుగా జరపాలి. డెస్క్‌ని జరిపినట్టుగా.. వెనక్కి ముందుకు చేస్తూ ఉంటే.. పొట్ట కండరాలు, భుజాలు, ఛాతీ, చేతి కండరాలు దృఢమవుతాయి.
మెట్లతో: ఫస్ట్ అంతస్తుకైనా.. పదో ఫ్లోర్‌కైనా లిఫ్ట్‌నే వినియోగిస్తుంటే ఒంటికి వ్యాయామం అందదు. దీన్ని వదిలి మెట్ల బాట పడితే కార్డియాక్ కసరత్తులు చేసినట్టే. దీంతో గుండెకు మంచి వ్యాయామం అంటుంటారు నిపుణులు.
ఛైర్ స్క్వాట్: గంటకోసారైనా కుర్చీలోనే నాలుగైదుసార్ల చొప్పున నిదానంగా లేస్తూ, కూర్చుండటమే ఛైర్ స్క్వాట్. ఈ వ్యాయామానికి హ్యాండ్‌రెస్ట్ లేని కుర్చీలు, స్టూల్‌లాంటివి బాగుంటాయి. దీంతో వెన్నెముక, తొడలు, కాలిపిక్కలకు మంచిది.
బ్యాక్‌ప్యాక్ వెయిట్‌లిఫ్ట్: భోజనం, అల్పాహారం, నీళ్ల సీసా, ఇతర సామగ్రి.. వీటితో కుర్ర ఉద్యోగి బ్యాగు లేదా బ్యాక్‌ప్యాక్ బరువు బాగానే ఉంటుంది. దీంతో వెయిట్‌లిఫ్టింగ్ వ్యాయామం చేయొచ్చు. ముందు నిటారుగా నిల్చొని, తర్వాత ఒక కాలి వెనక్కి ఇంకో కాలు ముందుకు జరపాలి. ముందు కాలికి సమాంతరంగా బ్యాక్‌ప్యాక్ చేతిలో పట్టుకొని కిందికి, పైకి లేపుతుండాలి.
హిప్ బ్రిడ్జ్: ఆఫీసులో ఒక మనిషికి సరిపోయినంత స్థలం ఉంటే చాలు. నేలపై వెల్లకిలా పడుకొని కాళ్లను ముందుకు చాచాలి. 90 డిగ్రీల కోణంలో కాళ్లను పైకి ఎత్తాలి. తర్వాత నడుమును పైకి, కిందికి ఎత్తుతూ దించుతూ ఉండాలి.
కుర్చీతో: సీట్లో కూర్చునే కాళ్లు, చేతులను ఆడిస్తూ థొరాటిక్ ఎక్స్‌టెన్షన్లు.. హ్యాండ్ రెస్ట్‌లను పట్టుకొని నడుమును అటూ ఇటూ తిప్పుతూ రొటేషనల్ స్ట్రెచ్‌లు.. ముందుకూ వెనక్కి వంగుతూ.. బెండింగ్ కసరత్తులు చేయొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Cyber Crime: వామ్మో.. స్కామ్ కాల్స్‌తో 53 బిలియన్ డాలర్లు కొల్లగొట్టారా?
-
World News
Sheikh Hasina: మా పోర్టులు భారత్ వాడుకోవచ్చు: హసీనా
-
Politics News
Prashant Kishor: ‘అలాగైతే.. విపక్షాల ఐక్యత పని చేయదు..!’
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!