టిండర్‌ యుగంలో కొత్త అధ్యాయానికి రష్మిక మందన్న, విక్కీ కౌశల్‌ శ్రీకారం (ప్రకటన)

వస్త్ర ప్రపంచంలో అధునాతనమైన మ్యాచో స్పోర్టో ప్రచారం కోసం ప్రముఖ నటులు రష్మిక మందన్న, విక్కీ కౌశల్‌ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు.

Updated : 07 Dec 2022 14:57 IST

మహిళా సాధికారత దిశగా మ్యాచో స్పోర్టో తొలి అడుగులు

వస్త్ర ప్రపంచంలో అధునాతనమైన మ్యాచో స్పోర్టో ప్రచారం కోసం ప్రముఖ నటులు రష్మిక మందన్న, విక్కీ కౌశల్‌ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ప్రకటనల్లో మూస పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్తదనానికి ఆహ్వానం పలికారు. ఒకప్పటి ప్రకటనలు కేవలం స్త్రీల కేంద్రంగా ఉండేవి. వారినే కథావస్తువుగా చూపించే వారు. కానీ, ఈ ప్రకటనలో స్త్రీ కోరికకూ విలువనిచ్చారు. వారిని చూపులనూ చట్టబద్ధం చేస్తూ పాత ధోరణలకు స్వస్తి పలికి లింగ సమానత్వానికి పెద్దపీట వేశారు.

స్త్రీ, పురుషులు వేర్వేరు అనే నిర్వచనాన్ని చెరిపేస్తూ ఆధునిక మహిళల ఇష్టాలకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా ఈ ప్రకటనను రూపొందించారు. మెన్స్‌వేర్‌కు సంబంధించిన ఈ ప్రకటనలో రష్మిక మందన్న యోగా టీచర్‌గా కనిపించారు. ఈ ప్రకటన మొత్తం స్త్రీల ఇష్టాల కోణంలోనే సాగుతుంది. ఈ ప్రకటనకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రష్మిక మందన్న అందమైన అభినయానికి, విక్కీ కౌశల్‌ లుక్స్‌ తోడయ్యాయి. విక్కీ చిరునవ్వులు, రష్మిక వ్యక్తీకరణలు కొత్తగా కనిపిస్తున్నాయి. ఎవరూ అసౌకర్యానికి గురికాకుండా తన ఇష్టాన్ని, కోరికను బయటపెట్టిన మహిళగా రష్మిక ఆకట్టుకుంటోంది. ఇది ప్రగతిశీల మహిళల భావనలకు ఈ ప్రకటన తొలి అడుగుగా చెప్పొచ్చు. ప్రచార కార్యక్రమాల్లో మహిళలను చూపించే ధోరణికి చెల్లుచీటి పాడుతూ మ్యాచోస్పోర్టో ఈ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది.

జేజీ హోసియరీ గురించి..

దేశీయ ప్రముఖ వస్త్ర తయారీదారు జేజీ హోసియరీ. మ్యాచో స్పోర్టో, అమూల్‌ కాంఫీ, జొయిరో స్పానింగ్‌ బ్రాండ్స్‌ కింద ఇన్నర్‌వేర్‌, అథ్లెజర్, లాంజ్‌వేర్, లెగ్గింగ్స్‌ వంటివి ఈ కంపెనీ రూపొందిస్తోంది. మ్యాచో, కాంఫీ వంటి బ్రాండ్లతో మిడ్‌ ప్రీమియడం సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు వస్త్ర తయారీలోనూ, ఇటు మార్కెటింగ్‌లోనూ వినూత్న వ్యాపార పద్ధతులు అవలంబించి గ్లోబల్‌ బ్రాండ్‌గా అవతరలించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని