e-Bikes: ఈ-బైక్‌ల రేంజ్ వేరు
బండి కొనేముందు ‘మైలేజీ ఎంత?’ అనడగడం సాధారణం. కొనేవాళ్లు యూత్ అయితే ‘హయ్యెస్ట్ స్పీడ్ ఎంత?’ అంటారు. ఇప్పుడు ఈ-బైక్‌ల కాలం కావడంతో.. ‘వాటి రేంజ్ ఎంత?’ అనే మాట మొదలైంది.
యువాహనం
బండి కొనేముందు ‘మైలేజీ ఎంత?’ అనడగడం సాధారణం. కొనేవాళ్లు యూత్ అయితే ‘హయ్యెస్ట్ స్పీడ్ ఎంత?’ అంటారు. ఇప్పుడు ఈ-బైక్‌ల కాలం కావడంతో.. ‘వాటి రేంజ్ ఎంత?’ అనే మాట మొదలైంది. అంటే ఒక్కసారి రీఛార్జ్ చేస్తే.. బ్యాటరీ బండి ప్రయాణించే దూరం అన్నమాట. అలాంటి వాళ్లకి సమాధానం, ప్రస్తుతం ఎక్కువ రేంజ్ ఉన్న కొన్ని ద్విచక్రవాహనాలు ఇవి.
హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్
అత్యధిక రేంజ్: 140కి.మీ.లు
1.53కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం దీని సొంతం. గరిష్ఠ వేగం 45కి.మీ.లు. 1.2కిలోవాట్ల బ్యాటరీతో పని చేస్తుంది.
ధర రూ: 77,490
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1
అత్యధిక రేంజ్: 141కి.మీ.లు
4 కిలోవాట్ల మేటి బ్యాటరీ సామర్థ్యంతో పరుగులు పెడుతుంది. దీంతోపాటు ఎస్1 ప్రొ అనే మరో రకం ఉంది. ‘హైపర్’ మోడ్‌తో మేటి పికప్ ఉంటుందంటోంది తయారీదారు.
ధర రూ: 99,999
రివోల్ట్ ఆర్‌వీ 400
అత్యధిక రేంజ్: 150కి.మీ.లు
దేశంలోని మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటి. 85కి.మీ.ల గరిష్ఠ వేగం దీని సొంతం. 3.25కిలోవాట్ల బ్యాటరీతో పని చేస్తుంది.
ధర రూ: 1.19లక్షలు
ఓబెన్ ఎలక్ట్రిక్ రార్
అత్యధిక రేంజ్: 200కి.మీ.లు
4.4కిలోవాట్ల పెద్ద బ్యాటరీతో పని చేస్తుంది. హవోక్, సిటీ, ఇకో అనే రైడింగ్ మోడ్‌లున్నాయి. యాంటీ థెఫ్ట్ సిస్టమ్, ఎల్‌ఈడీ లైట్లు ఆకట్టుకునే ఫీచర్లు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది.
ధర రూ: 1.02లక్షలు
ఏథర్ 450ఎక్స్ జెన్3
అత్యధిక రేంజ్: 146కి.మీ.లు
ఎక్కువగా అమ్ముడయ్యే బ్యాటరీ కంపెనీల్లో ఇదొకటి. వార్ప్, స్పోర్ట్, రైడ్, ఇకో, స్మార్ట్ ఇకో అనే రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీ, ఆన్‌బోర్డ్ నావిగేషన్, రివర్స్ మోడ్ చెప్పుకోదగ్గ ఫీచర్లు.
ధర రూ: 1.39లక్షలు
కొమాకీ రేంజర్
అత్యధిక రేంజ్: 220కి.మీ.లు
క్రూజర్ శ్రేణి ఫీచర్లతో రూపొం దించిన ఈ-బైక్ ఇది. 3.6కిలోవాట్ల బ్యాటరీతో దూసుకెళ్తుంది. గరిష్ఠ వేగం గంటకి 80కి.మీ.లు. శక్తిమంతమైన 4కిలోవాట్ల బీఎల్‌డీసీ మోటర్ బండికి బలం.
ధర రూ: 1.85లక్షలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TSPSC: టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌ను తొలగించాలి.. ఓయూలో విద్యార్థుల ఆందోళన
-
Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్, చెన్నై- విజయవాడ టికెట్ ధరలివే..!
-
High Speed Train: ఆరు నెలల్లో హైస్పీడ్ ట్రైన్.. వెల్లడించిన రైల్వే మంత్రి
-
Vizag: గోనెసంచిలో చుట్టి సముద్రంలో పడేసి.. విశాఖలో బాలుడి హత్య
-
ICC Rankings: మనోళ్లే కింగ్స్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆధిపత్యం
-
Vivek Ramaswamy: వివేక్ రామస్వామితో డిన్నర్ ఆఫర్.. ఒక్కొక్కరికి 50 వేల డాలర్లపైమాటే!