ఎండల్లో ఎలాగంటే..

వేసవిలో విహార యాత్రలు జోరుగానే సాగుతాయి. మండే ఎండల్లో యాత్ర సజావుగా సాగాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి..

Updated : 09 Dec 2022 13:07 IST

వేసవిలో విహార యాత్రలు జోరుగానే సాగుతాయి. మండే ఎండల్లో యాత్ర సజావుగా సాగాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి.

* పర్యాటక ప్రదేశాల్లో ఆహారం మీద నియంత్రణ కోల్పోతాం. దారివెంట కనిపించే పదార్థాలన్నీ రుచి చూసేస్తుంటాం. వేసవిలో మసాలాలు దట్టించిన పదార్థాలకు దూరంగా ఉండండి. శరీరానికి చలువ చేసే ఆహారం తీసుకోండి.
వడదెబ్బ తగలకుండా.. నీళ్లు ఎక్కువగా తాగాలి. కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తరచూ తీసుకుంటూ ఉండాలి. చల్లగా ఉంటుందని పానీయాల్లో ఐస్‌ ముక్కలు వేసుకుంటూ ఉంటారు. అతి శీతలంగా ఉన్న పానీయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఐస్‌ తయారీకి ఎలాంటి నీళ్లు వాడుతున్నారో కూడా తెలియదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని