క్రయోథెరపీకి మీరూ సిద్ధమా?
సినీతార రకుల్‌ప్రీత్ సింగ్ మైనస్ 15 డిగ్రీల మంచు గడ్డల మధ్య మునక వేసిన వీడియో మీరూ చూసే ఉంటారు. ఆమె గజగజ వణుకుతుంటే.. కొందరు అభిమానుల మనసు ఐసైపోయింది.
సినీతార రకుల్‌ప్రీత్ సింగ్ మైనస్ 15 డిగ్రీల మంచు గడ్డల మధ్య మునక వేసిన వీడియో మీరూ చూసే ఉంటారు. ఆమె గజగజ వణుకుతుంటే.. కొందరు అభిమానుల మనసు ఐసైపోయింది. ఎందుకొచ్చిన ఈ తిప్పలు అనుకుంటున్నారా? ఇది ‘క్రయోథెరపీ’ అనే ఒక రకం వ్యాయామం బాస్. దీంతో ఒంటికి బోలెడు లాభాలున్నాయంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. తెలుసుకుంటే పోలా...
* ఈ క్రయోథెరపీనే కోల్డ్ థెరపీ అంటారు. అతి శీతల నీటితో షవర్ బాత్ చేయడం.. మంచు ముక్కల మధ్య నీటిలో గడపడం.. మైనస్ వందల డిగ్రీలుండే కూల్ చాంపర్లలో ఉండటం, పూర్తిగా గడ్డ కట్టిన నీటి సరస్సుల్లో రంధ్రాలు చేసి, వాటిలో కొద్దిసేపు ఉండటం.. క్రయోథెరపీనే.
* మైనస్ 15 డిగ్రీల నుంచి మైనస్ వందల డిగ్రీలుండే ఇలాంటి ప్రదేశాల్లో 30 సెకన్ల నుంచి 3 నిమిషాల వ్యవధి పాటు గడుపుతుంటారు.
* ఇలా తరచూ చేస్తుంటే శరీరంపై పేరుకుపోయిన మృతకణాలు, పెరిగిపోయిన అనవసర కణజాలం శుభ్రమవుతుంది. అన్ని అవయవాలకూ రక్తప్రసరణ మెరుగవుతుంది. తీవ్ర రక్తపోటు తగ్గుతుంది. మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
* బరువు తగ్గడానికి సైతం క్రయోథెరపీ దోహదపడుతుందంటారు. శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత సైతం నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
* ఇన్ఫెక్షన్లతో పోరాడే, రోగనిరోధకతను పెంచే బ్లడ్‌సెల్స్‌ను.. ఈ వ్యాయామం ప్రేరేపిస్తుంది. దీర్ఘకాలిక, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటారు. మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి ఇదొక మార్గం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Baby: ‘బేబి’ విజయం.. దర్శకుడికి నిర్మాత బహుమానం.. అదేంటంటే?
-
Postal Jobs: పోస్టల్లో 30,041 ఉద్యోగాలు.. రెండో షార్ట్‌లిస్ట్ ఇదిగో!
-
Janasena: ‘ఎందుకు ఆంధ్రాకు జగన్ వద్దంటే..’: జనసేన పొలిటికల్ కార్టూన్
-
TCS: టీసీఎస్ కీలక నిర్ణయం.. ‘హైబ్రిడ్’కు గుడ్‌బై..!
-
Crime News: ఎన్సీఆర్బీ పేరిట ఫేక్ మెసేజ్.. విద్యార్థి ఆత్మహత్య.. ఇంతకీ ఆ మెసేజ్‌లో ఏముంది?
-
Maneka Gandhi: మేనకా గాంధీపై ఇస్కాన్ రూ.వంద కోట్ల పరువు నష్టం దావా