virat Kohli: కోహ్లీలా.. కోపమొద్దు..
విరాట్ కోహ్లీ అంటే ఓ యూత్ ఐకాన్. మైదానంలోకి దిగితే కేరింతలు.. బ్యాటుతో పరుగుల వరద పారిస్తుంటే.. కేకలు.
విరాట్ కోహ్లీ అంటే ఓ యూత్ ఐకాన్. మైదానంలోకి దిగితే కేరింతలు.. బ్యాటుతో పరుగుల వరద పారిస్తుంటే.. కేకలు. తనని అభిమానించేవాళ్లైతే కోకొల్లలు. ఇంత మంచి పేరున్నా.. తరచూ కయ్యానికి కాలు దువ్వుతాడనే విమర్శలూ ఎదుర్కొంటున్నాడు. తాజాగా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్‌తో గొడవకి దిగి రూ.కోటి జరిమానా ఎదుర్కొన్నాడు. అదుపు లేని కోపమే వీటిన్నింటికీ కారణం. కోహ్లీనే కాదు.. ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్లనైనా.. ఈ కోపం పాతాళానికి లాగుతూనే ఉంటుంది. దీన్ని అదుపులో పెట్టడమెలా?
* మాట కత్తికన్నా పదునైంది. కోపంలో వదిలే ఒక్కో పరుషమైన మాట ఎదుటివాళ్ల హృదయాల్ని చీల్చేస్తుంది. అందుకే వాదన ముదురుతుంది అని భావించినప్పుడే నోటికి అడ్డుకట్ట వేసి మౌనాన్ని ఆశ్రయించడమే మంచిది.
* నోటి నుంచి బయటికొచ్చిన మాటని వెనక్కి తీసుకోలేం. ఆ కోపమే ఒక్కోసారి ఇద్దరు వ్యక్తుల మధ్య పగలు, ప్రతీకారాల దాకా వెళ్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కోపం చల్లారాకైనా.. ఎదుటివాళ్లకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబితే సరి. సగం నష్టనివారణ జరిగినట్టే.
* నడక, చిన్నచిన్న వ్యాయామాలు తరచూ చేస్తుంటే కోపం అదుపులో ఉంటుందని చాలా అధ్యయనాల్లో తేలింది. ధ్యానం, యోగా సైతం.. మనసుని ప్రశాంతంగా ఉంచే మార్గాలే.
* తప్పు చేయనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరిలో కొన్ని అవలక్షణాలుంటాయి. వీటిని వ్యక్తిగతంగా తీసుకొని ఎదుటివాళ్లను శత్రువుగా చూడొద్దు. క్షమాగుణం ఉన్నప్పుడు కోపం, ప్రతీకారం అనే పదాలకే మన డిక్షనరీలో చోటుండదు.
* హాస్యం.. ఒక వ్యక్తిలోని కోపాన్ని తగ్గించే ఔషధం అంటారు అధ్యయనకారులు. సరదాగా ఉండే వ్యక్తులతో ఎక్కువ సమయం గడపడం, కామెడీ వీడియోలు చూడటం.. ఇవీ కోపాన్ని తగ్గించే మార్గాలే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్