ఫిట్‌నెస్‌ కోర్‌కుందాం

మన కోర్‌ భాగం శరీరం మొత్తానికి ఇరుసులాంటిది. పొట్ట, నడుము చుట్టూ ఉండే అంతర్గత కండరాలు దృఢంగా ఉంటేనే మొత్తం శరీరం ఫిట్‌గా ఉంటుంది

Updated : 25 Feb 2023 02:42 IST

మన కోర్‌ భాగం శరీరం మొత్తానికి ఇరుసులాంటిది. పొట్ట, నడుము చుట్టూ ఉండే అంతర్గత కండరాలు దృఢంగా ఉంటేనే మొత్తం శరీరం ఫిట్‌గా ఉంటుంది. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా దానికోసం ఎలాంటి వ్యాయామాలు చేయాలో చెబుతున్నారు ఫిట్నెస్‌ గురూలు.

 వెయిట్‌ ట్రైనింగ్‌: కోర్‌ భాగాన్ని అనుసంధానించే వెన్నెముక బాడీలో చాలా కీలకమైంది. ఇది దృఢమవ్వాలంటే డెడ్‌లిఫ్ట్స్‌, స్క్వాట్స్‌లాంటి వ్యాయామాలు తప్పనిసరి. దీంతో వెన్నెముక బలపడి స్థిరత్వం సమకూరుతుంది. కెటెల్‌బెల్స్‌, డంబెల్స్‌తో చేసే ఫార్మర్స్‌ క్యారీ సైతం మొత్తం వీపు భాగాన్ని దృఢం చేస్తుంది.ఫిట్‌నెస్‌ కోర్‌కుందాం
 పైలేట్స్‌: పొట్టలోపలి కండరాలను శక్తిమంతం చేసే వ్యాయామం ఇది. దీంతో వెన్నునొప్పి సైతం మాయమవుతుంది. శరీరంపై నియంత్రణ ఉంటుంది. తీరైన ఆకృతి సమకూరుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
 యాబ్స్‌ వీల్‌ రోలౌట్‌: ఈ పరికరంతో పొట్ట కండరాలను మంచి దృఢంగా తయారు చేసుకోవచ్చు. కడుపు, పిరుదులు, వీపు కండరాలు, పక్కటెముకలు బలపడతాయి. శరీరం నియంత్రణలో ఉంటుంది.
 ప్లాంక్‌: దీన్ని ఫుల్‌బాడీ వర్కవుట్‌గా చెప్పుకోవచ్చు. కోర్‌ భాగం మొత్తాన్నీ కవర్‌ చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా చేస్తే శరీరంలో స్థిరత్వం, బాడీపై నియంత్రణ ఉంటుంది. బ్యాక్‌పెయిన్‌ తగ్గుతుంది.
క్రంచెస్‌: కొత్తగా కోర్‌ వ్యాయామం ప్రారంభించేవాళ్లకి అనువైన వర్కవుట్‌ ఇది. పొట్ట, నడుము, అంతర్గత కండరాలు అన్నింటికీ వ్యాయామం. రోజుకు నాలుగైదు సెట్ల క్రంచెస్‌ చేసినా మంచి ఉపయుక్తం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని