ప్లేటోనిక్ లవ్..జిందాబాద్!
కళ్లూ కళ్లూ ఒక్కటవగానే మదిలో కలవరం మొదలవుతుంది...అభిప్రాయాలు పెనవేసుకోగానే ప్రేమ ఊసులు గుసగుసలాడతాయి...మనసులు కలవగానే తనువుల్లో కలవరం చెలరేగుతుంది...
కళ్లూ కళ్లూ ఒక్కటవగానే మదిలో కలవరం మొదలవుతుంది...
అభిప్రాయాలు పెనవేసుకోగానే ప్రేమ ఊసులు గుసగుసలాడతాయి...
మనసులు కలవగానే తనువుల్లో కలవరం చెలరేగుతుంది...
ఇది ఈతరం ప్రేమ
రెండు హృదయాల్లో ఒకరిపై ఒకరికి చెప్పలేనంతం ఇష్టం..
ఇద్దరి మధ్యా పడకగదిలోకీ వెళ్లేంత సాన్నిహిత్యం...
అయినా వాళ్లలో శృంగార ఆలోచనలకు తావుండదు...
రొమాంటిక్ ధ్యాస అణుమాత్రమైనా ఉండదు...
ఇది కలకాలం నిలిచే ‘ప్లేటోనిక్ లవ్’.
బ్లాక్ అండ్ వైట్ రోజులైనా.. జనరేషన్ జెడ్ కాలమైనా.. ప్రేమికుల మధ్య బంధం పదికాలాలు నిలిచి ఉండాలంటే రెండో దానికే జై కొట్టాలంటున్నారు లవ్ గురూలు.
ఈ కాలం కుర్రకారుకి వేగం ఎక్కువ. వాట్సప్‌లో స్టేటస్ మారేలోపే టపీమని ప్రేమలో పడిపోతుంటారు. ఫేస్‌బుక్‌లో ప్రొఫైల్ పిక్చర్ ఛేంజ్ చేయకముందే బ్రేకప్ అంటూ సిద్ధమవుతారు. ఇన్‌స్టంట్ కాఫీలా.. టూ మినిట్స్ నూడిల్స్‌లా.. ప్రేమలోనూ తొందరపాటే. అయితే ఈ మిలీనియల్ జమానాలోనూ తనువుల ధ్యాస మరిచి మనసుల్ని జయించడాన్నే శ్వాసించే పవిత్ర ప్రేమికులూ ఉన్నారు. ఈ ఆర్ట్ ఆఫ్ లవింగ్.. ప్లేటోనిక్ ప్రేమలో భాగమైనప్పుడే జీవితం ఫైవ్‌స్టార్ చాక్లెట్‌లా తీపిమయం అవుతుందంటున్నారు.
ఏంటీ భావన?
దైవానికి మరో రూపం ప్రేమంటాడు ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త ప్లేటో. ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు అనేది ఆయన భావన. ఆయన ఊహల్లోంచి.. పేరులోంచి పురుడు పోసుకుందే ప్లేటోనిక్ లవ్. ప్రేమలో చిలిపి చేష్టలు.. రొమాంటిక్ భావనలు.. స్వీట్ సమ్‌థింగ్స్.. సాధారణం అన్నది నేటి ప్రేమికుల ఆలోచన. కానీ ప్లేటోనిక్ లవ్.. రొమాంటిక్ లవ్‌కి పూర్తి వ్యతిరేకం. ఇక్కడ శృంగార మధురిమలకు చోటుండదు. బస్టాప్‌లో ఒక మెరుపుతీగ కనబడ్డప్పుడో.. కాఫీషాప్‌లో ఒక ఇంద్రధనుస్సు విరిసినప్పుడో.. ఆన్‌లైన్‌లో ఓ అబ్బాయి గుండెను మీటినప్పుడో ఉద్భవించే ప్రేమ కాదిది. ఈ ప్లేటోనిక్ ప్రేమలు స్నేహం, బాగా పరిచయస్థుల్లోనే మొదలవుతాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే మాటకి దీని డిక్షనరీలో తావే లేదు. చాలాకాలంగా కలిసి చదువుతున్న క్లాస్‌మేట్‌తో మనసు కలవొచ్చు. కొలీగ్‌తో పరిచయం.. పరిణయంగా రూపాంతరం చెందొచ్చు. ఒక్కసారి మొదలైన ఈ బంధం కాలం గడిచేకొద్దీ దృఢంగా మారుతుంది. ఎమోషనల్‌గా రూపాంతరం చెందుతుంది.
ఇవీ లక్షణాలు
ఆమోదం: అపర ప్రేమికులైనా వారి మధ్య కొన్ని పొరపొచ్చాలు, అభిప్రాయబేధాలుంటాయి. ఇక్కడలా కాదు.. మంచైనా, చెడైనా ఒకర్నొకరు ఆమోదిస్తారు. నచ్చని గుణాల్నీ స్వీకరిస్తారు. అలా చేసినప్పుడే ఇద్దరి ఇగో సంతృప్తి చెంది ప్రేమలో మరో మెట్టు ఎక్కగలుగుతారు.
విధేయత: బలీయమైన ప్రేమ ఒక్కోసారి ఎదుటివాళ్లపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. దీంతో అనవసర గొడవలు మొదలవుతాయి. ప్లేటోనిక్ ప్రేమలో విధేయతకే పెద్దపీట. ఆధిపత్యం ఉండదు.
నమ్మకం: నమ్మకం లేని చోట ప్రేమ, బంధం నిలబడవు. ప్లేటోనిక్ ప్రేమకి తొలి అడుగు నమ్మకమే. అప్పటికే ఒకర్నొకరు బాగా తెలిసి ఉండటంతో.. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. వాళ్లు దూరంగా ఉండాల్సి వచ్చినా అది సడలదు.
అవగాహన: ప్రేమ చూపిస్తేనే ప్రేమించినట్టు కాదు. ఇందులో ప్రేమికుడి/ప్రేమికురాలి మనస్తత్వం, మూడ్‌నీ అంచనా వేస్తారు. ఏ పరిస్థితుల్లో తను ఎలా ఉంటారు? అప్పుడేం చేయాలి? అని అర్థం చేసుకొని మసలుతారు.
సాంగత్యం: రొమాన్స్‌కి చోటు లేకున్నా.. కలిసి ప్రయాణాలు చేయడం.. సరదాల్లో పాలు పంచుకోవడం.. కష్టాల్లో ఓదార్పునివ్వడం.. ఇవన్నీ ఉంటాయి. ప్రతి కష్టం, సుఖంలో తోడుంటారు.
హద్దుల్లో: మనసు ఇచ్చిపుచ్చుకుంటేనే.. ఒకరికొకరు సొంతం అయినట్టు. అయినా ప్లేటోనిక్ ప్రేమికులు అన్నింట్లో తల దూర్చరు. వాళ్ల ప్రైవసీకి భంగం కలిగించరు.
సాన్నిహిత్యం: శృంగార భావనలు లేకున్నా.. భవబంధాల బందీలు వీళ్లు. ప్రేమికుల కుటుంబానికీ దగ్గరగా ఉంటారు. ఇంట్లో వ్యక్తిలా కలిసిపోతారు.
క్లుప్తంగా చెప్పాలంటే.. సోషల్ అడ్డాలో వికసించి అడ్డదిడ్డంగా వెళ్లని ఆకర్షణే ప్లేటోనిక్ లవ్. వయస్సునామీలో కొట్టుకుపోతూ తనువుల దాహం తీర్చుకునే కాంక్షల ప్రేమ కాదు. లాభనష్టాల బేరీజు వేసుకుంటే ఇందులో అన్నీ సానుకూలాంశాలే ఉంటాయి. ఈ ప్రేమలో ఉన్నవాళ్లకు నీడలా వెన్నాడే స్నేహితుడు.. కంటికి రెప్పలా కాచుకునే అమ్మానాన్నలు దొరికినట్టే. రొమాంటిక్ బంధానికి సమాజ ఆమోదం ఉండదు.. ఇక్కడ ఆ ముప్పేమీ లేదు. ఎదుటివాళ్ల నుంచి ఆశించేదేం లేకపోవడంతో.. మానసిక ఒత్తిడి, బ్రేకప్ ప్రస్తావనలే ఉండవు. ఒకవేళ విడిపోయే పరిస్థితి వచ్చినా.. దేవదాసులా జీవితాంతం వగచే అవసరమే ఉండదు.
అన్నికాలాల్లోనూ..
ప్రేమించడం తప్పు కాదు. దానికి విలువలు జోడించినప్పుడే ఆ బంధం దృఢమవుతుంది. ప్రేమ పేరుతో ఏకాంతంగా గడపడం, పెళ్లికి ముందే తొందరపడటం.. ఆకర్షణే తప్ప నిజమైన ప్రేమ అనిపించుకోదు. జంట ఒక్కసారి రొమాన్స్ బాట పడితే ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పలచనవుతూ ఉంటుంది. తనువులు కాకుండా మనసులు ముఖ్యం అనుకున్నప్పుడే అది పది కాలాలపాటు పదిలంగా ఉంటుంది. పదేపదే ఐలవ్యూలు చెప్పుకోవడం.. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కాకుండా.. కష్టసుఖాల్లో తోడున్నప్పుడే దానికి విలువ. ఇది హైటెక్ యుగం అయినా, జనరేషన్ జెడ్ కాలమైనా ప్లేటోనిక్ ప్రేమతోనే భవిష్యత్తు.
డా.టీఎస్ రావు, కౌన్సెలింగ్ సైకాలజిస్టు
కరచాలనమూ చేసుకోలేదు
మాది ఆరేళ్ల ప్రేమ. చిన్మయ్‌తో జిమ్‌లో పరిచయమైంది. చాలారోజుల తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. ఇంట్లో వేడుకలకు ఒకర్నొకరం ఆహ్వానించుకునేవాళ్లం. ఓసారి నాకు కొంత మొత్తం అత్యవసరం అయితే తనే వ్యక్తిగత రుణం తీసుకొని ఇచ్చాడు. మేం ప్రతి చిన్న విషయం పంచుకుంటాం. తరచూ కలుసుకుంటుంటాం. అయినా.. కనీసం కరచాలనం చేసుకునేవాళ్లం కాదు. రొమాన్స్ అనే మాట మా మధ్య లేనేలేదు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత మావాళ్లు పెళ్లి చేస్తామన్నారు. ‘ఎవర్నైనా ప్రేమించావా?’ అనడిగారు. అప్పుడే చిన్మయ్‌ని ఎందుకు ప్రేమించకూడదు? అనే ఆలోచన వచ్చింది. వెంటనే ప్రపోజ్ చేశా. మావాళ్ల ఆమోదంతో ఈమధ్యే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాం.
సాత్విక
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ
-
Sports News
Team India Slip Cordon: టీమ్ ఇండియా స్లిప్ కార్డన్‌లో ఎవరు బెస్ట్.. ChatGPT ఏం చెప్పింది?