Smart Phone: ఫోన్‌.. హ్యాకైందా?

ముచ్చట పడి తీసుకున్న ఫొటోలు.. గాళ్‌ఫ్రెండ్‌తో జరిపిన సరస సంభాషణలు.. బ్యాంకుకు అను సంధానించిన యూపీఐ ఖాతాలు.. అన్నీ కుర్రకారు సెల్‌ఫోన్‌లోనే ఉండటం ఈరోజుల్లో కామన్‌.

Published : 15 Jun 2024 00:27 IST

ముచ్చట పడి తీసుకున్న ఫొటోలు.. గాళ్‌ఫ్రెండ్‌తో జరిపిన సరస సంభాషణలు.. బ్యాంకుకు అను సంధానించిన యూపీఐ ఖాతాలు.. అన్నీ కుర్రకారు సెల్‌ఫోన్‌లోనే ఉండటం ఈరోజుల్లో కామన్‌. మరి అలాంటి విలువైన ఫోన్‌ హ్యాక్‌ అయితే..? హమ్మో.. ఇంకేమైనా ఉందా! ఆ పరిస్థితి వస్తే ఏం చేయాలి? హ్యాక్‌కి గురైందని ఎలా తెలుసుకోవాలి? ఇదుగోండి దారులు. 

  • ఉన్నపళంగా బ్యాటరీ ఛార్జింగ్‌ డౌన్‌ అయిపోతుంటే ఏదో అనుమానాస్పద సాఫ్ట్‌వేర్‌ మన ఫోన్‌లోకి చొరబడిందని అనుమానించాల్సిందే. 
  • పెద్దగా వాడకుండానే ఫోన్‌ బాగా వేడెక్కిపోతుంటే ఏదో మాల్వేర్, స్పైవేర్‌ మనకు తెలియకుండానే సెల్‌ఫోన్‌లో రన్‌ అవుతున్నట్టే.
  • ఇంటర్నెట్‌ వాడకం ఒక్కసారిగా పెరిగిపోతోందంటే.. ఫోన్‌లోని సమాచారం అవతలి వ్యక్తికి మీకు తెలియకుండానే చేరిపోతోందన్నమాట.
  • మీ ప్రమేయం లేకుండా ఎసెమ్మెస్‌లు, సోషల్‌మీడియా సందేశాలు వెళ్లిపోతున్నాయంటే.. కచ్చితంగా మీ ఫోన్‌ పరాయి వాళ్ల చేతిలో పడ్డట్టే.
  • మీరు డౌన్‌లోడ్‌ చేయకుండానే కొత్త యాప్‌లు మీ ఫోన్‌లో ప్రత్యక్షమవడం, ఫోన్‌ వేగం తగ్గిపోవడం, అంతర్జాతీయ కాల్స్‌.. ఇవన్నీ హ్యాకింగ్‌ సంకేతాలే.

పైవాటిలో ఏది జరిగినా..

వెంటనే నెట్, వై-ఫై ఆపేయాలి. ఫోన్‌ని ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టాలి. యాప్స్‌ అన్నీ పరిశీలించి ఏవైనా కొత్తవి, అనుమానాస్పదమైనవీ ఉంటే తొలగించాలి. పాస్‌వర్డ్‌లు మార్చేయాలి. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లు నిక్షిప్తం చేయాలి. వీలైతే ఫ్యాక్టరీ రీసెట్‌ కొట్టాలి.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని