శ్రీమహాలక్ష్మి అవతారంలో కనకదుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

Published : 23 Oct 2020 15:51 IST

విజయవాడ(ఇంద్రకీలాద్రి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీమహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులను ఉదయం 5గంటల నుంచి దర్శనాలకు అనుమతించారు. రాత్రి 8గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. కొవిడ్‌ నేపథ్యంలో పరిమితంగానే భక్తులను అనుమతిస్తున్నారు. దర్శనం కోసం ముందుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటోంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని