రెడ్‌మీ కొత్త ఫోన్‌: 5K బ్యాటరీ... ₹6,799 ధర

బడ్జెట్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రెడ్‌మీ వరుస లాంఛ్‌లతో అదరగొడుతోంది. ఇప్పటికే రెడ్‌మీ 9, 9 ప్రైమ్‌ పేరుతో అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది.....

Published : 02 Sep 2020 23:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: బడ్జెట్ ఫోన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న రెడ్‌మీ వరుస ఫోన్లతో అదరగొడుతోంది. ఇప్పటికే రెడ్‌మీ 9, 9 ప్రైమ్‌ పేరుతో అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. తాజాగా ఈ మోడల్స్‌కి కొనసాగింపుగా రెడ్‌మీ 9ఏ పేరుతో సరికొత్త ఫోన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎక్కువ ఫీచర్స్‌తో తక్కువ ధరలో ఫోన్‌ కొనాలనుకునేవారు ఈ మోడల్స్‌ని ప్రయత్నించవచ్చు.

రెడ్‌మీ 9ఏ ఫీచర్స్‌

ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డాట్ డ్రాప్‌ డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో జీ25 ఎస్‌వోసీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం రెండు కెమెరాలను ఇస్తున్నారు. వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5ఎంపీ కెమెరా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్‌టైమ్ ఎక్కవ కాలం ఉండేందుకు ఎన్‌హ్యాన్స్‌డ్ లైఫ్‌స్పాన్‌ బ్యాటరీ (ఈఎల్‌బీ) టెక్నాలజీని ఉపయోగించినట్లు షావోమి తెలిపింది.

ఈ ఫోన్‌ 2 జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌ ధర రూ. 6,799గాను, 3 జీబీ ర్యామ్‌/32 జీబీ అంతర్గత స్టోరేజి వేరియంట్ ధర రూ. 7,499గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 4 నుంచి ఎంఐ.కామ్, అమెజాన్‌, ఎంఐ స్టోర్లలో 9ఏ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. మిడ్‌నైట్ బ్లాక్‌, నేచర్ గ్రీన్, సీ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని