AP News: ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తు నోటీసులు జారీ చేసిన పోలీసులు

 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కలెక్టరేట్‌ ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.

Published : 19 Jan 2022 22:20 IST


అమరావతి:  పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు ప్రకటించిన కలెక్టరేట్‌ ముట్టడిపై పోలీసులు ఆంక్షలు విధించారు. గుంటూరు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నేతలకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు.  కలెక్టరేట్‌  ముట్టడితో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు పట్టించుకోకుండా ముందుకెళ్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. రేపు సాయంత్రం 5గంటలకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంయుక్త సమావేశం అనంతరం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. సమ్మెకు ఇప్పటికే సంపూర్ణ మద్ధతు ప్రకటించామని చెప్పారు. ఆర్టీసీలోని ఈయూ, ఎన్‌ఎంయూ సహా అన్ని సంఘాలు సమ్మెలో పాల్గొంటాయని వెల్లడించారు. ఉద్యమంలోకి అడుగుపెడితే  వెనక్కి తగ్గేది ఉండదని, తాము చేయబోయే సమ్మె తీవ్ర రూపం దాల్చుతుందన్నారు. ఉద్యమానికి ప్రజలు మద్దతివ్వాలని కోరారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని