AndhraPradesh : ఏపీలో కొత్త కేసులు.. మరణాల్లో తగ్గుదల

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అలానే మరణాలూ తగ్గాయి. 24 గంటల వ్యవధిలో

Updated : 29 Jan 2022 17:21 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటితో పోలిస్తే కేసుల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అలానే మరణాలూ తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 40,357 నమూనాలను పరీక్షించగా 11,573 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,60,181కి చేరింది. కరోనా నుంచి ఒక్క రోజులో 9,445 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,30,162 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 

కొవిడ్‌తో ఒక్క రోజులో ముగ్గురు మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. దీంతో నేటి వరకు కరోనాతో 14,594 మంది మృతి చెందినట్లు వైద్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,24,06,132 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని