Cm Jagan: ఏపీ గవర్నర్‌తో సీఎం జగన్‌ సమావేశం.. జిల్లాల పునర్విభజనపై చర్చ

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు అరగంట సమావేశమైన గవర్నర్‌, సీఎంలు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున...

Updated : 01 Mar 2022 05:09 IST

అమరావతి: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. దాదాపు అరగంట సమావేశమైన గవర్నర్‌, సీఎంలు సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నందున సీఎం జగన్‌ గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. మరోవైపు జిల్లాల పునర్విభజన విషయాన్ని కూడా సీఎం గవర్నర్‌కు వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్విభజన జరుగుతుందని, ప్రజల నుంచి వినతులను స్వీకరించి ఆమోదయోగ్యమైన విధానంలో నూతన జిల్లాలను ఏర్పాటు చేయనున్నామని సీఎం వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని