Corona Virus: ఏపీలో కొత్తగా 310 కేసులు నమోదు

ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా మరో 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షించారు

Updated : 11 Oct 2021 16:27 IST

అమరావతి: ఏపీలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. కొత్తగా మరో 310 కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షించారు. తాజాగా కొవిడ్‌ నుంచి 994 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌తో కొత్తగా చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

కొత్తగా నమోదైన కొవిడ్‌ కేసుల్లో అత్యధికంగా గుంటూరు జిల్లాలో 54 కేసులు రాగా.. నెల్లూరులో 51, చిత్తూరు 45, విశాఖ 42, తూర్పుగోదావరి 38, ప్రకాశం 23 కేసులు చొప్పున నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్నిపరిశీలిస్తే.. 2.87కోట్ల శాంపిల్స్‌ పరీక్షించగా.. 20,57,562 పాజిటివ్‌ కేసులు రాగా.. 14,256 మంది మరణించారు. కొవిడ్‌ బారిన పడినవారిలో 20,36,048 మంది కోలుకోగా.. ప్రస్తుతం 7258 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని