
Updated : 22 Apr 2021 14:47 IST
ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసహనం
అమరావతి: ఏపీలో కొవిడ్ నియంత్రణ చర్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఈనెల 26లోపు కౌంటర్ వేయాలని ఆదేశించింది. కొవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ సామాజిక కార్యకర్త తోట సురేశ్‌బాబు గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రాథమిక అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని ఆక్షేపించింది. నిబంధనలు పాటించని ప్రైవేటు ఆస్పత్రులపై తీసుకున్న చర్యలపై నివేదిక కోరింది. ఈనెల 27లోపు అఫిడవిట్ దాఖలు చేయకపోతే తగిన ఉత్తర్వులిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి
Tags :